ఏపీ అసెంబ్లీలో గీత దాటుతున్న బూతులు

రాజకీయాలంటే విలువలు లేకపోవడమే. దానికి కొత్త అర్థాలు ఆపాదిస్తున్నారు. అసభ్య పదజాలానికే ప్రాధాన్యమిస్తున్నారు. సభలో హుందాగా ప్రవర్తించాల్సిన వారే పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. మంచి మాటలతో నడిపించాల్సిన సభా మర్యాదలను గంగలో కలుపుతున్నారు. తిట్ల దండకానికే ఓటు వేస్తున్నారు. ప్రత్యర్థిని ఎంత ఘాటు పదజాలంతో తిడితే అంత మార్కులు జగన్ దగ్గర పొందే అవకాశాలు ఉండడంతో వైసీపీ నేతలు తమ నోటి వెంట బూతులనే వల్లె వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నాయకులను అదే స్థాయిలో దూషిస్తూ జగన్ […]

Written By: NARESH, Updated On : May 21, 2021 1:52 pm
Follow us on

రాజకీయాలంటే విలువలు లేకపోవడమే. దానికి కొత్త అర్థాలు ఆపాదిస్తున్నారు. అసభ్య పదజాలానికే ప్రాధాన్యమిస్తున్నారు. సభలో హుందాగా ప్రవర్తించాల్సిన వారే పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. మంచి మాటలతో నడిపించాల్సిన సభా మర్యాదలను గంగలో కలుపుతున్నారు. తిట్ల దండకానికే ఓటు వేస్తున్నారు. ప్రత్యర్థిని ఎంత ఘాటు పదజాలంతో తిడితే అంత మార్కులు జగన్ దగ్గర పొందే అవకాశాలు ఉండడంతో వైసీపీ నేతలు తమ నోటి వెంట బూతులనే వల్లె వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నాయకులను అదే స్థాయిలో దూషిస్తూ జగన్ దగ్గర మెప్పు పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎవరూ పెదవి విప్పిన పాపాన పోవడం లేదు. భాష ప్రయోగంపై పట్టించుకోవడం లేదు. ఫలితంగా నాయకుడంటే బూతులు మాట్లాడేవాడే అనే కొత్త అర్థంలో చూడాల్సి వస్తుందేమో చూడాలి.

ఏపీ అసెంబ్లీలో సభా మర్యాదలు పాటించడం లేదు. జగన్ కు ఇష్టం లేని రాజకీయ నేతల్ని బండ బూతులు తిట్టించి చివరికి రికార్డుల నుంచి తొలగించాలని కోరడం జగన్ కే చెల్లుతుంది. ఎంపీ రఘురామ కృష్ణం రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజద్రోహం కేసు పెట్టించిన జగన్ నాయకులను బూతులు తిట్టిస్తూ పబ్బం గడుపుకోవడం యాదృచ్ఛికం కాదు. శాసనసభలోనే ఇంత కంటే దారుణమైన భాష రఘురామపై ప్రయోగించారు. వైసీపీ నేతలు విలేకరుల సమావేశాల్లో టీడీపీ నేతలపై అసభ్య పదజాలం వాడారు.

తిట్టడం ఎందుకు? తొలగించామనడం ఎందుకు?
అసెంబ్లీ సాక్షిగా జోగి రమేశ్ ప్రసంగం చూసి ప్రతి ఒక్కరూ అబ్బుర పడ్డారు. ముఖ్యమంత్రి జగన్ సైతం నివ్వెర పోయారు. రమేశ్ భాషను పాటించిన విలువలకు సొంత పార్టీ నేతలు గులాం అయ్యారు. పార్లమెంటరీ సంప్రదాయాల గురించి తెలిసిన వార సైతం నివ్వెరపోయారు. రమేశ్ ప్రసంగానికి ఫిదా అయ్యారు. ఇంత దారుణంగా మాట్లాడడం దేనికి మళ్లీ తొలగించాలని కోరడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ భావజాలాన్ని వినిపించవచ్చు. కానీ అసభ్య పదజాలాన్ని వాడి నలుగురిలో తక్కువ కావడం ఎందుకు? రాజకీయాలంటే ఇంత దారుణమా? ఎదుటి వారిని తిడితేనే పదవులు వస్తాయా అని ప్రజాస్వామ్యవాదులు పరేషాన్ అవుతున్నారు.

రెండేళ్లుగా వైసీపీ నేతల తీరులో మార్పు లేదు. అసభ్య పదజాలానికే ప్రాధాన్యమస్తూ మంచి మాటలను మరిచిపోతున్నారు. ఎదుటి వారిని తిట్ల తోనే సమాధానం చెబుతున్నారు. ఇంతటి ఘోరానికి కారణాలేంటని ఆరా తీస్తే అధినేత దగ్గర ప్రాపకం పొందేందుకే అని చెబుతున్నారు. హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేయాలంటే ఇలాగే మాట్లాడాలని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. పవిత్రమైన అసెంబ్లీలో అపవిత్రమైన భాష ప్రయోగిస్తూ జగన్ మన్ననలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.