https://oktelugu.com/

HBD Rana: టాలీవుడ్​ భల్లాల దేవ రానా పుట్టినరోజు నేడు.. ఆయన సినీకెరీర్​పై ప్రత్యేక కథనం

HBD Rana: దగ్గుబాటి వంశంలో పుట్టి పెరిగి.. బాబాయ్​ వెంకటేశ్​, తాత రామానాయుడులాగే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి అనతి కాలంలోనే స్వతహాగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా దగ్గుబాటి. ఈ రోజు ది గ్రేట్​ భల్లాల రానా పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్​తో పాటు వ్యక్తిగత జీవితంపై ఓ లుక్కేద్దాం. రానా 1984 డిసెంబరు 14న జన్మించారు. ఆయన తండ్రి డి. సురేశ్ బాబు. ప్రముఖ నిర్మాతగా ప్రస్తుతం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 14, 2021 / 10:41 AM IST
    Follow us on

    HBD Rana: దగ్గుబాటి వంశంలో పుట్టి పెరిగి.. బాబాయ్​ వెంకటేశ్​, తాత రామానాయుడులాగే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి అనతి కాలంలోనే స్వతహాగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా దగ్గుబాటి. ఈ రోజు ది గ్రేట్​ భల్లాల రానా పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్​తో పాటు వ్యక్తిగత జీవితంపై ఓ లుక్కేద్దాం.

    రానా 1984 డిసెంబరు 14న జన్మించారు. ఆయన తండ్రి డి. సురేశ్ బాబు. ప్రముఖ నిర్మాతగా ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో దూసుకెళ్లిపోతున్నారు. తాత రామానాయుడు, తండ్రి సురేశ్​ బాబులాగే రానా కూడా కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహించారు. చదువుతున్న రోజుల్లోనే రానా విజువల్​ ఎఫెక్ట్స్​పై మంచ అవగాహన పెచుకుని.. కొంత కాలం కంపెనీ కూడా నిర్వహించారు.

    20 ఏళ్లు వచ్చేసరికి బొమ్మలాట అనే చిన్నపిల్లల సినిమాను కె. రాఘవేంద్రరావు కొడుకు సూర్య ప్రకాశ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రాంతీయ చిత్రంగా ఉత్తమ నేషనల్​ అవార్డును దక్కించుకుంది. 2010లో రానా లీడర్​ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో రానాకు నటుడిగా మంచి పేరు లభించింది. ఆ తర్వాత దమ్​ మారో దమ్​ అనే హిందీ సినిమాలో నటించారు రానా. అలా తర్వాత కొన్ని సినిమాలు చేసినా అడపాదడపా ఆడుతూ వచ్చాయి. అయితే, రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో భల్లాల దేవుడి పాత్రకు  ప్రేక్షకులు నీరాజనం పట్టారు. విలన్​ అంటే ఇలా ఉండాల్రా అనేంతలా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు రానా. రుద్రమదేవిలోనూ చాళుక్య వీరభద్ర పాత్రలో ఆకట్టుకున్నారు.

    ఇక రానా నటించిన ఘాజీ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు. రానా హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రిలో విలక్షణమైన పాత్రతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్​గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో చంద్రబాబు పాత్రలో కనిపించారు రానా. అరణ్య సినిమాతో అందరినీ షాక్​కు గురి చేశారు. కాగా ప్రస్తుతం విరాట పర్వం సినిమా తీయగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు ఎప్పుడో 2016లో తీసిన 1945 సినిమా డిసెంబరు 31న ప్రేక్షకులను పలకరించనుంది. మరోవైపు భీమ్లానాయక్​లో డేనియల్ శేఖర్​గా కనిపించనున్నారు రానా.

    మరోవైపు నంబర్​ వన్​ యారీ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించారు రానా. విశాల్​ నటించిన యాక్షన్​ సినిమాలో ఓ పాట కూడా పాడారు. ఇలా తనలోని కళలన్నింటీ తట్టిలేపి ప్రేక్షకులను నిత్యం వినోదాన్ని పంచి పెడుతున్నారు.