https://oktelugu.com/

రాష్ట్రపతి భవన్‌కు కాలినడకన రాహుల్‌

వ్యవసాయ చట్టాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ గత కొద్ది రోజులుగా రైతులు ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. వీరి ఉద్యమం రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. అయితే.. రైతుల ఉద్యమంపై రాహుల్‌ గాంధీ రాష్ట్రపతిని కలువనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, నాయకుల ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేయనున్నారు. Also Read: అమరావతి పోరు.. వైసీపీకే లాభం కేవలం కాలినడకనే ఆయన రాష్ట్రపతి భవన్‌కు చేరబోతున్నారు. విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మార్చ్‌ నిర్వహించనున్నారు. […]

Written By: , Updated On : December 24, 2020 / 10:54 AM IST
Follow us on

Rahul Gandhi
వ్యవసాయ చట్టాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ గత కొద్ది రోజులుగా రైతులు ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. వీరి ఉద్యమం రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. అయితే.. రైతుల ఉద్యమంపై రాహుల్‌ గాంధీ రాష్ట్రపతిని కలువనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, నాయకుల ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేయనున్నారు.

Also Read: అమరావతి పోరు.. వైసీపీకే లాభం

కేవలం కాలినడకనే ఆయన రాష్ట్రపతి భవన్‌కు చేరబోతున్నారు. విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మార్చ్‌ నిర్వహించనున్నారు. ఓ మెమోరాండంతోపాటు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన రెండు లక్షల సంతకాలను రాష్ట్రపతికి అందజేయనున్నారు. నూతన చట్టాలను రద్దు చేసే విషయంలో రాష్ట్రపతి కోవింద్ జోక్యం చేసుకోవాలంటూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సంతకాల సేకరణను చేపట్టింది.

రైతు ఉద్యమానికి సంఘీభావంగా విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ మార్చ్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. పార్లమెంట్ భవనం దగ్గర లోని విజయచౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు కాలినడకన వెళ్లి రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాన్ని అందజేయనున్నారు. మూడు ‘నల్ల వ్యవసాయ’ చట్టాలను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ 28 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు కాంగ్రెస్ పార్టీతో సహా పలు పార్టీల మద్దతు లభించింది.

Also Read: డేంజర్: వెలుగుచూసిన మరో రకం కరోనా

రైతుల డిమాండ్ పై జోక్యం చేసుకోవాలని కోరుతూ గత వారమే రాష్ట్రపతిని కలిసి రాహుల్ గాంధీతో పాటు, పలు ప్రతిపక్ష పార్టీల నేతలు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కొద్ది మంది పెట్టుబడిదారుల కోసం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే మూడు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా రాహుల్‌ చేపట్టనున్న ఈ మార్చ్‌తో మరోవైపు ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌ విజ్ఞాపన పత్రాలతో రాష్ట్రపతి జోక్యం చేసుకుంటారా..? లేక వాటిని అలాగే వదిలేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా ఉంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్