రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో వచ్చిన వివాదాస్పద చిత్రం మర్డర్. కొన్నాళ్ల క్రితం మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ యదార్ధ ఘటన ఆధారం మూవీ చేస్తన్నట్లు వర్మ ప్రకటించడం జరిగింది. ఈ మూవీ ప్రకటన నాటి నుండి అనేక వివాదాలకు కారణం అయ్యింది. కోర్టు వివాదంలో చిక్కుకొని విడుదల ఆలస్యం అయ్యింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా మర్డర్ మూవీని విడుదల చేసి వర్మ తన పంతం నెగ్గించుకున్నారు. వివాదాస్పద అంశాలు కథావస్తువుగా తీసుకొని… ప్రజలను ఆకర్షించి తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి సొమ్ము చేసుకోవడం వర్మకు అలవాటు అయ్యింది. అయితే వర్మ గత చిత్రాలతో పోల్చుకుంటే మర్డర్ మూవీ ఒకింత పరవాలేదు అనిపిస్తుంది.
Also Read: ‘ఆచార్య’ సెట్‌లో చిరంజీవిని కలిసిన మోహన్‌బాబు
మర్డర్ మూవీలో వర్మ చెప్పిన కథ అందరికీ తెలిసిందే. జీవితంలో చిన్నస్థాయి నుండి ఎదిగిన మాధవరావు(శ్రీకాంత్ అయ్యర్) కూతురు నమ్రతను(సాహితీ)ని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. కూతురు పుట్టిన తరువాత ఐశ్వర్యం వచ్చిపడిందని నమ్మిన మాధవరావు కన్నకూతురుపై హద్దులు లేని ప్రేమ కురిపిస్తారు. తన స్థాయికి తగ్గట్టు నమ్రత పెళ్లి చేసి, మంచి వరుడుని తేవాలనుకున్న మాధవరావుకు ఆమె షాక్ ఇస్తుంది. తన కంటే తక్కువ కులానికి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకొని వెళ్ళిపోతుంది. కూతరు పరువు తీసిందన్న కోపంతో మాధవరావు దారుణమైన నిర్ణయం తీసుకుంటాడు. కూతురు భర్తను ఊరి నడిబొడ్డులో కిరాతకంగా నరికి చంపిస్తాడు… ఆ తరువాత తండ్రి కూతుళ్ళ మధ్య నడిచే మానసిక సంఘర్షణే మర్డర్ మూవీ.
Also Read: అనుష్క, కీర్తి సురేష్ బాటలో మరో టాప్ హీరోయిన్
కుల మత బేధాలు, ఆస్తుల మధ్య అంతరాలు, పరువుప్రతిష్టలు మనుషుల మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని చక్కగా ప్రస్తావించాడు దర్శకుడు ఆనంద్ చంద్ర. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తనను కాదని వేరే వాడితో వెళ్ళిపోతే తండ్రి పడే మానసిక వేదన తెరకెక్కించిన విధానం బాగుంది. కూతురు ప్రేమ కుటుంబాన్ని ఎంతలా చిన్నాభిన్నం చేసింది వాస్తవికతకు దగ్గరగా చూపించారు. పరువుకు ప్రేమకు మధ్య నలిగిపోయే తండ్రి వేదన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అల్లుడు హ్యతకు కోసం నడిపే ప్రణాళిక, చంపడం వంటి సన్నివేశాలు ఒళ్ళు గగుర్గొలిపేలా చూపించారు. తండ్రిగా శ్రీకాంత్ అయ్యర్, కూతురుగా సాహితీ పోటాపోటీగా నటించారు. కాకపోతే సెకండ్ హాఫ్ లో డ్రామా ఎక్కువ కావడం, సీరియల్ లా మెల్లగా సాగడం కొంచెం విసుగు తెప్పిస్తాయి. మొత్తంగా మర్డర్ పర్వాలేదు అనిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్