Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీలో ప్రతి సారి టికెట్ల పంచాయితీ ప్రధాన టాపిక్ గా ఉంటోంది. పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా ఎవరికో ఇచ్చారంటూ గొడవలు రేగడం సహజమే. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రెండు రోజులు రాష్ట్రంలో పర్యటించి టికెట్ల విషయంలో క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. దీంతో టికెట్ల కోసం ఢిల్లీ వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక్కడే జనం మధ్యలో ఉంటూ వారికి సేవలు చేసే వారికే టికెట్లు కేటాయిస్తామని కుండబద్దలు కొట్టారు. దీంతో ఇప్పుడు నేతల చూపు నియోజకవర్గాలపై పడుతోంది.

టికెట్ల విషయంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనతో నేతల్లో ఆందోళన మొదలైంది. తాము ఇక నియోజకవర్గాల్లోనే ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాభిప్రాయం ప్రకారమే టికెట్లు కేటాయిస్తామని చెబుతుండటంతో ఇక చేసేదేమీ లేదని ప్రజల్లోనే ఉండాలని చూస్తున్నారు. గతంలో ఢిల్లీ చుట్టు ప్రదక్షిణలు చేసి టికెట్ల కోసం పైరవీలు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అసమ్మతి వాదులకు తావులేదు. పార్టీలో వారిని తొలగించాల్సిందేనని సూచిస్తున్నారు.
Also Read: Secretariat Employees: ఏపీలో సచివాలయ ఉద్యోగులకు పొమ్మన లేక పొగ
రాహుల్ గాంధీ పర్యటన కార్యకర్తలు, నేతల్లో నూతనోత్తేజం నింపుతోంది. ఇన్నాళ్లు ప్రజలకు దూరమైన పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజులు రాష్ట్రంలో పర్యటించి స్థానిక సమస్యలపై అవగాహన చేసుకున్నారు. దీంతో నేతలను వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఎదుర్కొని నిలవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తూ వారితో మమేకం కావాలని చెబుతున్నారు.

రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచిస్తున్నారు. రైతుల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందనే భావన వారిలో రావాలన్నారు. అందుకోసమే అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు. రైతుల్లో పార్టీ పై నమ్మకం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. అప్పుడే మన పార్టీ విజయం సాధిస్తుంది. రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడమే ధ్యేయంగా అందరు ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.
Also Read:KTR- Congress Party: కాలం చెల్లిన పార్టీతో పొత్తా? కాంగ్రెస్ కు చురకలంటించిన కేటీఆర్