రఘురామ.. ఈ చిన్న లాజిక్ మర్చిపోయారా?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎరక్కపోయి ఇరుక్కున్నారా? లాజిక్ మర్చిపోయి ఫిర్యాదుల్లో దొరికేశారా? ఏపీ సీఐడీ ఆయన లూప్ హోల్స్ పసిగట్టి మరిన్నికేసులకు రంగం సిద్ధమవుతోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. తాజాగా రఘురామకృష్ణంరాజు ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ తోపాటు పోలీసులపై ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన ఐఫోన్ విచారణ సమయంలో లాక్కున్నారని.. 9000922222 నంబర్ గల ఆ ఫోన్ ను తనకు తిరిగి ఇవ్వాలని లేకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని […]

Written By: NARESH, Updated On : June 6, 2021 12:08 pm
Follow us on

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎరక్కపోయి ఇరుక్కున్నారా? లాజిక్ మర్చిపోయి ఫిర్యాదుల్లో దొరికేశారా? ఏపీ సీఐడీ ఆయన లూప్ హోల్స్ పసిగట్టి మరిన్నికేసులకు రంగం సిద్ధమవుతోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

తాజాగా రఘురామకృష్ణంరాజు ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ తోపాటు పోలీసులపై ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన ఐఫోన్ విచారణ సమయంలో లాక్కున్నారని.. 9000922222 నంబర్ గల ఆ ఫోన్ ను తనకు తిరిగి ఇవ్వాలని లేకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే ఆ తర్వాత ఏపీ రిటైర్డ్ సలహాదారు, మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ కు 9000911111 అనే వాట్సాప్ నంబర్ నుంచి బెదిరింపు మెసేజ్ లు వస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఎంపీ రఘురామ ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసి అదే నంబర్ అన్నారు.

నిజానికి రఘురామ చెప్పిన నంబర్ 9000922222. కానీ పీవీ రమేష్ చేసిన ట్వీట్ లోని నంబర్ కూడా నాదేనని తాజాగా అనడం సంచలనమైంది. ఇక ఈ ఐఫోన్ ను ఏపీ సీఐడీ పోలీసులు తీసుకోలేదని.. తిరిగి ఇచ్చేశారని అరెస్ట్ సమయంలోనే ఎంపీ రఘురామ కుమారుడు భరత్ చెప్పిన వీడియోలు మీడియాలో హైలెట్ అయ్యాయి.

అంటే ఫోన్ తన దగ్గరే పెట్టుకొని రఘురామ ఇలా నాటకాలు ఆడాడా? ఆ ఫోన్ ఎవరిదగ్గర ఉందనే విషయాన్ని సిగ్నల్స్ ద్వారా తేల్చి రఘురామపై ఏపీ సీఐడీ పోలీసులపై ఆరోపించినందుకు గాను కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఏపీ పోలీసులు రెడీ అయినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఫోన్ నంబర్ల విషయంలోనే రఘురామ అడ్డంగా దొరికిట్టు తెలుస్తోంది.