బెదిరింపులకు భయపడేది లేదంటున్న ‘ఆర్ఆర్ఆర్’

వైసీపీ ఎంపీలందరిదీ ఓ దారి అయితే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు(ఆర్ఆర్ఆర్)ది మరోదారి. ఆయన ఎంపీగా ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి సొంత పార్టీ నేతలను.. ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలకు రఘురామకృష్ణ రాజు మధ్య కొంతకాలం మాటలయుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే సీఎం జగన్ మాత్రం రఘురామకృష్ణ రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. Also Read: ఏపీ […]

Written By: NARESH, Updated On : September 16, 2020 7:00 pm
Follow us on

వైసీపీ ఎంపీలందరిదీ ఓ దారి అయితే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు(ఆర్ఆర్ఆర్)ది మరోదారి. ఆయన ఎంపీగా ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి సొంత పార్టీ నేతలను.. ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలకు రఘురామకృష్ణ రాజు మధ్య కొంతకాలం మాటలయుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే సీఎం జగన్ మాత్రం రఘురామకృష్ణ రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Also Read: ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

ఇటీవల జగన్ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలను ఆర్ఆర్ఆర్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. బహిరంగగానే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని తప్పుబట్టారు. జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అమరావతి రాజధానిపై జగన్ రెఫరెండ్ నిర్వహిస్తానంటే తన పదవీకి రాజీనామా చేసి పోటీ చేస్తానంటూ సవాల్ విసిరారు. ఎన్నికల ఫలితాలను బట్టి జగన్ అమరావతి రాజధాని నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలకు ఆర్ఆర్ఆర్ కు మధ్య మళ్లీ మాటలయుద్ధం మొదలైంది.

రాయలసీమలో కూర్చొని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని తాజాగా ఆరోపించారు. తనతో కొందరు ఎంపీలు సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని కొందరు వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీపీ సమావేశానికి తనను పిలువకపోవడంపై స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలో దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం విచారకమన్నారు. దేవాలయాలపై దృష్టిసారించే మంత్రినే జగన్ నియమిస్తే మంచిదంటూ హితవు పలికారు. అమరావతి భూముల దర్యాప్తుపై సిట్ స్టే ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు.

Also Read: దేవాలయాల లొల్లి.. రంగంలోకి చంద్రబాబు

కాగా కొందరు తన దిష్టిబొమ్మను దహనం చేసే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉందని.. తన దిష్టిబొమ్మల దహనం గడ్డిని వాడటం కంటే వాటిని పొదుపుగా వాడండి అంటూ చురకలాంటించారు. రాయలసీమలో పాడి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. శివశక్తికి చెందిన పాలడైరీ చాలా తక్కువ ధరకు రైతుల నుంచి పాలను కొనుగోలు చేస్తూ దోపిడీకి పాల్పడుతుందంటూ ఆరోపించారు. జగన్ చుట్టూరా చేరిన కొంతమంది వల్లే ఆయన చెడ్డపేరు వస్తుందన్నారు. సీఎం జగన్ వీటిపై దృష్టిసారిస్తే బాగుంటుందని హితవు పలికారు.