https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ నుంచి జగన్ కు మరో సవాల్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు(ఆర్ఆర్ఆర్) సీఎం జగన్ కు మరో సవాల్ విసిరారు. నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచినప్పటి నుంచి రఘురామకృష్ణ రాజు వ్యవహార శైలిలో ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షాలను టార్గెట్ చేయాల్సిన ఎంపీ ఆయన సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో సొంతపార్టీల నేతల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెల్సిందే. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : September 15, 2020 5:34 pm
    Follow us on

    వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు(ఆర్ఆర్ఆర్) సీఎం జగన్ కు మరో సవాల్ విసిరారు. నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచినప్పటి నుంచి రఘురామకృష్ణ రాజు వ్యవహార శైలిలో ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షాలను టార్గెట్ చేయాల్సిన ఎంపీ ఆయన సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో సొంతపార్టీల నేతల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెల్సిందే.

    Also Read: వామ్మో….. అమరావతిలో అంత అవినీతి జరిగిందా….?

    రఘురామకృష్ణ రాజు వ్యవహారంపై పార్టీలోని పెద్దలంతా జగన్ దృష్టికెళ్లారు. దీంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే వార్తలు విన్పించాయి. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం షోకాజ్ నోటీసు జారీచేసి చేతులు దులుపుకుంది. దీనిపై కూడా రఘురామకృష్ణ రాజు ఎలక్షన్ కమిషన్ ను కలిసి వైసీపీ పార్టే లేదనే జగన్ ను ఇరుక్కున పెట్టారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినట్లు ప్రకటించుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

    ఆ తర్వాత కూడా రఘురామకృష్ణ రాజు వైసీపీ నేతలను, సీఎం జగన్ ను ఇరుకున పెట్టేలా మాట్లాడారు. ప్రధానంగా అమరావతి రాజధాని విషయంలో జగన్ సర్కార్ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. సీఎం జగన్ ఆదేశిస్తే తాను అమరావతి రాజధాని కోసం రాజీనామా చేస్తానంటూ ప్రకటించాడు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును జగన్ రెఫరెండం తీసుకొని అమరావతి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. జగన్ ఆదేశిస్తే తాను రాజీనామాకు సిద్ధమేనంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు.

    తాజాగా వైసీపీ అధిష్టానం తనను పార్టీ నుంచి బహిష్కరించినా తాను పార్లమెంట్ కమిటీ ఛైర్మన్ గా కొనసాగుతానని స్పష్టం చేయడం ఆసక్తికంగా మారింది. సీఎం జగన్ దగ్గర కొందరు తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని.. ఎవరెన్నీ చేసినా తనను ఏమి చేయలేరన్నారు. నర్సాపురం తన ఇమేజ్ తోనే గెలిచినట్లు మరోసారి రఘురామకృష్ణ రాజు స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని.. చట్టాలను గౌరవించకుండా వైసీపీ సర్కార్ అనేకసార్లు కోర్టులచే మొట్టికాయలు వేయించుకుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ కమిటీ ఛైర్మన్ గా తప్పించాలని వైసీపీ ఎంత ప్రయత్నం చేసినా అది జరుగదని జోస్యం చెప్పారు.

    Also Read: రవిప్రకాష్ చేతిలోకి టీవీ9 వెళ్లదు.. ఎందుకంటే?

    ఆఖరికి వైసీపీకి చెందిన ఎంపీలందరిని కేంద్రం పాదాల వద్ద పెట్టారని.. దమ్ముంటే తనను ఛైర్మన్ పదవీ నుంచి తొలగించాలని సవాల్ విసిరారు. పార్టీ తనను ఇంకా బహిష్కరించలేదని.. అలాంటప్పుడు తనను ఛైర్మన్ పదవీ నుంచి ఏవిధంగా తొలగిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు తనను ఏం చేయాలేరన్న తీరులో ఆయన పార్లమెంట్ ఆవరణలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఈసారైనా ‘ఆర్ఆర్ఆర్’ సవాల్ కు జగన్ స్పందిస్తారా? లేదో వేచి చూడాల్సిందే..!