https://oktelugu.com/

రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి వీడియో లీక్ చేసిందెవరు?

రాజకీయాల్లో విచిత్రాలు జరుగుతాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తారు. అవసరం, అవకాశం దొరకాలే కానీ అన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రభావం చూపిస్తుంటారు. తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా అధినేత రాధాకృష్ణ, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ గురించి ఓ వీడియో లీకైంది. ఇది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. అయితే ఈ వీడియో ఎలా లీకైంది? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేయించారా? అనే విషయాలపై పెద్ద చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తెలంగాణలో […]

Written By: , Updated On : July 5, 2021 / 05:28 PM IST
Follow us on

రాజకీయాల్లో విచిత్రాలు జరుగుతాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తారు. అవసరం, అవకాశం దొరకాలే కానీ అన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రభావం చూపిస్తుంటారు. తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా అధినేత రాధాకృష్ణ, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ గురించి ఓ వీడియో లీకైంది. ఇది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. అయితే ఈ వీడియో ఎలా లీకైంది? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేయించారా? అనే విషయాలపై పెద్ద చర్చ జరుగుతోంది.

ఒకప్పుడు తెలంగాణలో తెలుగుదేశానికి మంచి క్రేజీ ఉండేది. బలమైన కేడర్ ఉండేది. కాలక్రమంలో వారంతా టీఆర్ఎస్ లో చేరారు. కానీ అక్కడ ఇమడలేక బయటకు రాలేక సతమతమవుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న టీడీపీ వారిని ఎలాగైనా తమ వైపు తప్పుకోవాలనే ఉధ్దేశంతో టీడీపీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి.

బలమైన టీడీపీ సానుభూతిదారులను మచ్చిక చేసుకునేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.  వారిని తమ వైపుకే తెచ్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.  వారి ఓట్లను సాధించుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇదే అదనుగా వారిని దారికి తెచ్చుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. గతంలో టీడీపీకి బీసీలపై మంచి పట్టు ఉండేది. కేసీఆర్ ను దెబ్బ కొట్టాలంటే వారిని అక్కున చేర్చుకోవాల్సిందేని స్కెచ్ గీస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ సానుభూతిపరులను కాంగ్రెస్ నేత.. టీడీపీ సానుకూల నేతగా ఉన్న రేవంత్ రెడ్డికి దగ్గర చేయాలనేది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్లాన్ గా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో బీసీ ఓట్లను రాబట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా చేయాలనేది వారి ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది.. ఈ క్రమంలో బీసీలను టీడీపీ మాజీ కార్యకర్తలను చేరువ చేసే ఉద్దేశంతో తాజాగా ఏబీఎన్ రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి ఆడియోను లీక్ చేశారనే ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎవరు లీక్ చేశారనే దానిపై ఇప్పటికి కూడా స్పష్టత లేదు.