https://oktelugu.com/

రైతులకు దన్నుగా జగన్ సర్కార్.. 16 నుంచి పంటల కొనుగోళ్లు..?

దేశంలో కాలం మారుతున్నా, పార్టీలు మారుతున్నా రైతుల స్థితిగతులు మాత్రం మారడం లేదు. రైతులు పండించే పంట విషయంలో మార్కెట్ లో అమ్మే రేటుకు, వ్యాపారులు కొనే రేటుకు సంబంధం లేకుండా పోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ రైతులకు పయోజనం చేకూర్చాలనే ఉద్దేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుని కొత్త పథకాలను అమలు చేస్తూ పంటలకు మద్దతు ధర అందిస్తూ ప్రయోజనం చేకూరుస్తోంది. రాష్ట్రంలో సజ్జలు, రాగులు, […]

Written By: Kusuma Aggunna, Updated On : October 4, 2020 7:44 am
Follow us on

దేశంలో కాలం మారుతున్నా, పార్టీలు మారుతున్నా రైతుల స్థితిగతులు మాత్రం మారడం లేదు. రైతులు పండించే పంట విషయంలో మార్కెట్ లో అమ్మే రేటుకు, వ్యాపారులు కొనే రేటుకు సంబంధం లేకుండా పోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ రైతులకు పయోజనం చేకూర్చాలనే ఉద్దేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుని కొత్త పథకాలను అమలు చేస్తూ పంటలకు మద్దతు ధర అందిస్తూ ప్రయోజనం చేకూరుస్తోంది.

రాష్ట్రంలో సజ్జలు, రాగులు, మొక్కజొన్న పంటలు రైతుల చేతికందొస్తున్నాయి. అయితే దళారులు రైతుల నుంచి తక్కువ మొత్తానికే పంటలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతులకు దన్నుగా నిలబడాలని అనుకుంటోంది. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రభుత్వం రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయనుంది. పంట ఉత్పత్తులను అమ్మే రైతులు ఆర్బీకే కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

2020 – 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల గురించి కొన్ని రోజుల క్రితమే జగన్ సర్కార్ మద్దతు ధరలను ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను 24 పంటలకు వర్తించే విధంగా నిర్ణయం తీసుకుంది. మొక్కజొన్నకు ప్రభుత్వం 1850 రూపాయలు గిట్టుబాటు ధరగా ప్రకటించింది. సజ్జలకు 2,150 రూపాయలు, రాగులకు 3,295 రూపాయలు ప్రకటించింది.

వ్యాపారులు రైతులు కొనుగోలు చేస్తున్న రేట్లతో పోలిస్తే జగన్ సర్కార్ రైతుల నుంచి ఎక్కువ మొత్తానికి పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వం ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 100 క్వింటాళ్ల పంటను కొనుగోలు చేసే దిశగా నిర్ణయం తీసుకుంది. ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. రైతులు ఆర్బీకే కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకుంటే అధికారులు ఏయే తేదీల్లో పంట ఉత్పత్తులను తీసుకుని రావాలో తెలియజేస్తారు.