https://oktelugu.com/

మందుబాబులకు జగన్ సర్కార్ భారీ షాక్..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మందుబాబులకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కొన్ని రోజుల క్రితం ఏపీ హైకోర్టు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మూడు బాటిళ్ల మద్యం తెచ్చుకోవచ్చని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు, పోలీసులు ఏపీలోకి ప్రవేశించే అక్రమ మద్యానికి అడ్డుకోవడానికి మద్యం సీసాలను సీజ్ చేస్తూ ఉండటంతో పలువురు కోర్టును ఆశ్రయించారు. దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 4, 2020 7:11 am
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మందుబాబులకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కొన్ని రోజుల క్రితం ఏపీ హైకోర్టు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మూడు బాటిళ్ల మద్యం తెచ్చుకోవచ్చని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు, పోలీసులు ఏపీలోకి ప్రవేశించే అక్రమ మద్యానికి అడ్డుకోవడానికి మద్యం సీసాలను సీజ్ చేస్తూ ఉండటంతో పలువురు కోర్టును ఆశ్రయించారు.

    దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో 411 అమలు చేయాలని చెప్పింది. ఏపీ హైకోర్టు పిటిషనర్లు దాఖకు చేసిన పిటిషన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే తాజాగా ఎక్సైజ్ శాఖ మందు బాబులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే మద్యాన్ని రాష్ట్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని భావిస్తోంది.

    రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ఈ మేరకు ప్రతిపాదనలను పంపింది. పొరుగు రాష్ట్రాల నుంచి మందుబాబులు ఏపీకి మద్యం బాటిళ్లను తెచ్చుకుంటూ ఉండటంతో చట్ట సవరణ చేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం తెచ్చుకుంటే ఆ మద్యంపై పన్ను విధించే ప్రతిపాదనలను సైతం చేస్తోంది. అధికారులు కొందరు మద్యం ప్రియులు ఇళ్లలో తక్కువ రకం మద్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నట్లు గురించారు.

    దీంతో రాష్ట్రంలోని మూడు మద్యం సీసాల అనుమతి చట్టంలో మార్పులు చేసే దిశగా ఎక్సైజ్ శాఖ అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే మాత్రం మందుబాబులకు మరో షాక్ అనే చెప్పాలి. మరోవైపు రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రభుత్వం భారీగా తగ్గించింది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ప్రియులు మందు కొనుగోలు చేస్తే ఈ ఆదాయం మరింత తగ్గే అవకాశం ఉండటంతో జగన్ సర్కార్ ఈ దిశగా అడుగులు వేస్తోంది.