International Women’s Day 2022 : కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. బోర్జేషు మాతా.. శయణేషు రంభ పనిలో దాసిలాగా.. చేతల్లో మంత్రిలాగా.. అన్నం పెట్టేసమయంలో అమ్మలాగా.. పడక గదిలో రంభలా మారి మగాడి పుట్టుకకు కారణమైన మహిళ తన సర్వస్వాన్ని ధార పోస్తుంది. అంతే కాదు పురిటి నొప్పులతో పునర్జన్మలా పోరాడుతుంది. మగాడికి వారసుడిని ఇచ్చే క్రమంలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయదు. అంతటి మహత్తర శక్తి కలిగిన మహిళల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్ని జన్మలైనా ఆడదానికి మగాడు రుణపడే ఉంటాడు. పురుషుడి ఉన్నతిలో మహిళల పాత్ర ఎంతో ఉంటుంది. ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందనేది కూడా సత్యమే. అంతటి ప్రాధాన్యం ఉన్న మహిళకు నేడు దక్కేదేంటి? అడుగడుగునా అవాంతరాలే. ప్రతి రంగంలో కూడా పట్టింపులేని నిర్లక్ష్యమే. అతివలను అందలాలెక్కించే పదవులున్నా చివరికి పెత్తనం మాత్రం పురుషుడిదే కావడం గమనార్హం. మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ..

అబల అంటే సబల. సాధించేది. ఆకాశంలో సగం.. అవనిలో సగం అంటున్నారు కానీ ఎక్కడా సగం మాత్రం ఇవ్వడం లేదు. ఇంటి దగ్గర నుంచి తీసుకుంటే కార్యాలయమైనా, ఇల్లయినా సరే మహిళ స్థానం మాత్రం మారడం లేదు. వంటింటి కుందేలుగానే పిలువబడుతున్నారు. ఇప్పుడు మాత్రం పరిస్థితిలో కాస్త మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆటో దగ్గర నుంచి విమానం వరకు అన్ని నిడుపుతూ అతివ పెద్ద సాహసమే చేస్తున్నారు. అన్నింట్లో దూసుకుపోతున్నారు.
Also Read: యూపీలో మళ్లీ బీజేపీనే.!? కేంద్రంలో మళ్లీ మోడీనే? కానీ ట్విస్ట్ ఇదే!
క్రికెట్ అయినా అంతరిక్షమైనా ఎందులోనైనా రాణిస్తూ తానేమిటో నిరూపిస్తున్నారు మహిళలు. ఇన్నాళ్లు పెళ్లిళ్లు చేసుకుని వంటింటికే పరిమితమవుతున్న కాలం నుంచి ప్రస్తుతం ప్రపంచమే ఆమె గుప్పిట్లో తీసుకునే వరకు వెళ్లింది. భారతీయ క్రికెట్లో సైతం మహిళలు రాణిస్తున్నారు. మిథాలీ రాజ్ నుంచి యువతరం క్రికెటర్ల వరకూ అందలమెక్కిస్తున్నారు. అంతరిక్షం అనుభవం రుచి చూసిన కల్పనా చావ్లా, పరుగు పందెంలో దూసుకుపోయిన పీటీ ఉష, బరువులు ఎత్తిన కరణం మల్లేశ్వరి అయినా వారి సత్తా ఏమిటో ప్రపంచానికి చాటారు.
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అయిన మన మమతా బెనర్జీ, దేశంలో కాంగ్రెస్ ను నిలిపిన సోనియా గాంధీ, రెండు ఒలింపిక్ పథకాలతో మన పీవీ సింధు, టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన నిరూపిత కుటుంబానీకి చెందిన నామినీ లవ్లీనా బోర్గోహెయిన్, ఒలింపిక్ రజతం సాధించి మన మీరాబాయి చాను, భారత్ లో గోల్ఫ్ పై ఆసక్తిని పెంచి క్రీడాకారిణి అదితి అశోక్, భారత్ లో పారా ఒలింపిక్స్ లో స్వర్ణం తెచ్చిన పెట్టిన షూటర్ అవని లేఖర, మన తెలుగింటి చదరంగ మేధావి కోనేరు హంపి ఈ క్రీడాకారులే కాదు.. ఎంతో మంది మహిళా పారిశ్రామికవేత్తలు.. ఔత్సాహిక మహిళలు.. ధైర్యంగా ముందడుగు వేసిన సమంత సహా సినీ ప్రముఖులు.. ఇలా ఎంతో మంది మహిళా మణులు మనకు స్ఫూర్తి ప్రధాతలే.. ఆదర్శ మూర్తులే..

మహిళ అనే చిన్న చూపు నుంచి ఆమెను ప్రశంసించే స్థాయికి చేరుకుంది. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో ఏ పరీక్షల్లోనైనా అత్యధిక మార్కులు సాధించిన వారిలో మహిళలే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇవన్నీ చూస్తుంటే మహిళల స్థాయి పెరిగిందనే చెప్పాలి. పార్లమెంట్ లోనే మహిళలకు తగినన్ని సీట్లు ఇవ్వకుండా రాజకీయ పార్టీలు తక్కువ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా బిల్లు విషయంలో కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నా అది చట్టంగా మాత్రం మారడం లేదు. దీంతో మహిళలకు తగినన్ని స్థానాలు దక్కడం లేదని సమాచారం.
మహిళల కోసం అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నా అవి వారి దరి చేరడం లేదు. దీంతో వారి బతుకు పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మహిళల అభ్యున్నతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటోంది. అంతరిక్షంలో విహరించిన కల్పనా చావ్లా కానీ క్రెకెట్ లో సత్తా చాటిన మిథాలీ రాజ్ కానీ పరుగు పందాల్లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన పీటీ ఉష అయినా టెన్నిస్ సూపర్ స్టార్ అయిన సైనా సింధూ తులానీ లాంటి దేశ కీర్తి కిరీటానికి కలికితురాళ్లుగా నిలిచారు. తమ అకుంఠిత దీక్షతో ఎంతో ఎత్తుకు దూసుకుపోయి తామేంటో నిరూపించుకున్నారు.

గిరిజన జాతరలో కొలువబడుతున్న సమ్మక్క సారక్కలు కూడా మహిళలే కావడం తెలిసిందే. దేవుళ్లను కూడా ఆడవారితో పోల్చడం చూస్తున్నాం. భూమాత, భారతమాత లాంటి పేర్లతో పిలుస్తూ నిత్యం మనం ఆడాళ్లను తలుస్తున్నా వారికి సముచిత స్థానం మాత్రం ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇప్పటికి కూడా రాజకీయ పదవులు పొందుతున్న చాలా మంది మహిళలు తమ భర్తల పెత్తనంతో వెనకే ఉండిపోతున్న వైనం తెలిసిందే. ఈ క్రమంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్భయ, దిశ లాంటిచట్టాలు తెచ్చినా చాలా చోట్ల వారికి రక్షణ మాత్రం కల్పించలేకపోతున్నాయి.
ఇప్పటికైనా స్పందించి మహిళా రక్షణ కోసం చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే ఉంటున్నాయనేది నిర్వివాదాంశం. అతివల అండకు ఏ చర్యలు ఉపయోగపడటం లేదు. ఫలితంగా వారి అభ్యున్నతి అగాధంలో పడిపోతోందని తెలుస్తోంది. వారి కోసం ఇంకా కఠిన చట్టాలు తీసుకొచ్చి వారిని పురుషులతో సమానంగా నడిచేలా సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్: యూపీలో గెలుపు ఎవరిదంటే? పంజాబ్ లో షాకింగ్!