Public Servants: పబ్లిక్ సర్వెంట్లపై అంత ప్రేమెందుకో?

Public Servants: ప్రజాప్రతినిధులపై కేసులు వేయడంలో కేంద్రం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై నూతన చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఏర్పడింది. దీంతో వారిపై కేసు పెట్టాలంటే డీజీ స్థాయి అధికారి మాత్రమే కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. దీంతో ఎవరు పడితే వారు కేసులు పెట్టడానికి వీలు లేదు. ప్రభుత్వానికి లేదా పబ్లిక్ సర్వెంట్ ను తొలగించే అధికారం ఉన్న వ్యక్తికి ఈ ఫిర్యాదును ఇవ్వాలని కేంద్రం […]

Written By: Srinivas, Updated On : September 7, 2021 11:29 pm
Follow us on

Public Servants: ప్రజాప్రతినిధులపై కేసులు వేయడంలో కేంద్రం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై నూతన చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఏర్పడింది. దీంతో వారిపై కేసు పెట్టాలంటే డీజీ స్థాయి అధికారి మాత్రమే కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. దీంతో ఎవరు పడితే వారు కేసులు పెట్టడానికి వీలు లేదు. ప్రభుత్వానికి లేదా పబ్లిక్ సర్వెంట్ ను తొలగించే అధికారం ఉన్న వ్యక్తికి ఈ ఫిర్యాదును ఇవ్వాలని కేంద్రం తెలిపింది.

కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాల ప్రకారం డీజీ స్థాయి అధికారి మాత్రమే కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, ఎండీలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్లు, ఎండీలపై అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు చేయడానికి అనుమతి కోరాల్సి ఉంటుంది. సంబంధిత అధికారి ఫిర్యాదుకు సాక్ష్యాలు సరైనవో కావో నిర్ధారించుకుంటారు. వివరాలను దర్యాప్తు అనుమతి కోసం పెట్టిన దరఖాస్తులో స్పష్టంగా వివరించాలి.

1988లో రాజీవ్ గాంధీ హయాంలో అవినీతి నిరోధక చట్టం చేశారు. దీన్ని సడలిస్తూ మోడీ ప్రభుత్వం 2018లో కొత్త చట్టం తీసుకొచ్చింది. దానికి మార్గదర్శకాలను కూడా గుర్తించారు. పబ్లిక్ సర్వెంట్ కేటగిరీ కిందకు వచ్చే వారిపై కేసులు పెట్టే విషయంల దేశవ్యాప్తంగా ఒకే రకమైన పద్ధతి తీసుకొచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. దీంతో అధికార పార్టీలకు కాకుండా ప్రతిపక్ష పార్టీలకే తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ప్రభుత్వంలో పనిచేసే వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడు ఈ చట్టం తీసుకురావడంతో పనులు ఎలా సాగుతాయని విమర్శలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తమ పనులు కానిచ్చుకునేందుకు ఈ రకమైన చట్టాలు తీసుకొస్తున్నారని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.