Andhra Pradesh: హమ్మయ్యా.. ఏపీకి అప్పు పుట్టిందోచ్

Andhra Pradesh: అప్పు పుట్టింది అవ్వ అంటే కొంప మునిగింది కొడుకా అన్నట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అప్పుల్లోనే కూరుకుపోతోంది. ప్రతి నెల అప్పులతోనే గట్టెక్కుతోంది. దీంతో తలనొప్పిగా మారింది. అప్పులు తేవడం ప్రభుత్వం నడపడం ఓ సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కేంద్రం దగ్గర మోకరిల్లే పరిస్థితి ఏర్పడుతోంది. నెలనెల ఇదే పద్ధతి కావడంతో పరిస్థితి దిగజారిపోతోంది. కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఏపీ ఈ ఏడాది తీసుకోవాల్సిన రుణ పరిమితి […]

Written By: Srinivas, Updated On : September 7, 2021 11:13 pm
Follow us on

Andhra Pradesh: అప్పు పుట్టింది అవ్వ అంటే కొంప మునిగింది కొడుకా అన్నట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అప్పుల్లోనే కూరుకుపోతోంది. ప్రతి నెల అప్పులతోనే గట్టెక్కుతోంది. దీంతో తలనొప్పిగా మారింది. అప్పులు తేవడం ప్రభుత్వం నడపడం ఓ సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కేంద్రం దగ్గర మోకరిల్లే పరిస్థితి ఏర్పడుతోంది. నెలనెల ఇదే పద్ధతి కావడంతో పరిస్థితి దిగజారిపోతోంది. కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఏపీ ఈ ఏడాది తీసుకోవాల్సిన రుణ పరిమితి దాటేసింది. దీంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో మకాం వేసి పరిస్థితులు చక్కదిద్దుతున్నారు.

డిసెంబర్ వరకు మరో రూ.10,500 కోట్ల అప్పు కోసం అనుమతి కోసం రిజర్వ్ బ్యాంకు కు సమాచారం పంపింది. ఈ సమాచారం రిజర్వ్ బ్యాంకుకు చేరినట్లుగా తెలియగానే ఏపీ బాండ్లు అమ్మకానికి పెట్టింది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లుగా జగన్ ప్రభుత్వం పరిస్థితి ఉంది. నెలనెల గండం గట్టెక్కడానికి నానా తిప్పలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ నిర్వహణ కష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం.

అప్పుల విషయంలో కేంద్రం మొదట పేచీ పెడుతున్నా చివరికి కరుణించడంతో ఏపీ ఈ మాత్రం గట్టెక్కుతోంది. లేకపోతే ప్రభుత్వ మనుగడ కష్టమే అయ్యేది. ఈ పరిస్థితుల్లో అప్పులే జగన్ కు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. ప్రతి నెల అప్పులు తెస్తూ ప్రభుత్వాన్ని నడుపుుతన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎంత కాలం నెట్టుకొస్తారో అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిధులన్ని సంక్షేమ పథకాలకే మళ్లించడంతో సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది. కానీ ప్రజల మన్ననలు పొందాలంటే తప్పనిసరి కావడంతో ఇక చేసేది లేక ఇలా చేయాల్సి వస్తోందని చెబుతున్నారు.

ప్రతి నెల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో దాదాపు పదిహేను రోజులు మకాం వేసి ప్రభుత్వానికి అప్పు తీసుకొస్తున్నారు. ఏదిఏమైనా అప్పు తెచ్చినా పని అయ్యేందుకు ప్రముఖ పాత్ర వహించడంతో జగన్ కు తలనొప్పులు లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ కష్టాలు తీర్చే క్రమంలో ఆయన తలమునకలైపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడంతో సఫలమవుతున్నారు.