కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసింది. మూడో వేవ్ కూడా వస్తుందని నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సెకండ్ వేవ్ లో దేశంలో మరణ మృదంగం వినిపించింది. చాలా మంది అసువులు బాసారు. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ రావడానికి ముందే ప్రజలు రక్షణ పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.
మూడో వేవ్ గురించి ఆందోళనల నేపథ్యంలో ప్రజలంతా వ్యాక్సిన్ పొందడంతోపాటు ఈ సమయంలో ఆరోగ్యం, స్వీయ సంరక్షణపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
భారతదేశంలో కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ టీకా వేసుకోవడానికి దూరంగా ఉన్న వారు దేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక టీకా తీసుకోవద్దని వేరే సైడ్ ఎఫెక్ట్ లు ఉంటాయని అనే వారు కూడా ఎక్కువమందియే ఉన్నారు.
థర్డ్ వేవ్ లో ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపుతుందని.. పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలని చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే పిల్లలందరికీ టీకా ప్రక్రియ ప్రారంభించడానికి ఇంకా కొత్త సమయం పడుతుంది.
ఈ క్రమంలోనే మూడో వేవ్ నుంచి పిల్లలను ప్రజలను కాపాడుకోవడానికి ఈ చిట్కాలు పాటించాలని ఆడ్రోయిట్ బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ సుశాంత్ రౌరేన్ సూచించారు.
ప్రజలంతా కరోనా థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు. శారీరక శ్రమ, మానసిక ఆరోగ్యం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని, డయాబెటిస్, రక్తపోటు వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని సూచిస్తున్నారు.
ఇక రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రోటీన్లు, విటమిన్లు, కార్పొహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకుంటే శరీర రక్షణ వ్యవస్థను విస్తరించే సామర్థ్యం కలిగి ఉంటుందని చెబుతున్నారు.
ఇక ఒత్తిడికి, స్మోకింగ్, అల్కహాల్ మద్యంకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలా ఉంటేనే థర్డ్ వేవ్ ను తప్పించుకోగలరని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.