
సీఎం కేసీఆర్ మోసానికి మాస్టర్ ప్లాన్ వేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగ ఖాళీలపై కేసీఆర్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. ఖాళీలెన్నో తేల్చాలని తాజాగా చేస్తోన్న హడావుడి మరో మోసానికి మాస్టర్ ప్లాన్ లా ఉందన్నారు. 2020 డిసెంబర్ లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఖాళీలు ఉండగా 56 వేలు దాటడం లేదన్నట్లు దొంగ లెక్కటేంటి అని నిలదీశారు. వివిధ కార్పొరేషన్లలో ఖాళీల సంఖ్య లెక్క తీయాలని అన్నింటి పైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.