Priyanka Gandhi: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక పవర్‌ ఎంత.. ఇందిర వారసత్వం నిలబెడుతుందా?

కాంగ్రెస్‌ శ్రేణుల చిరకాల స్వప్నం నెరవేరింది. ఎట్టకేలకు తమ ప్రియతమ నేత ప్రియాంకగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారను. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కుమార్తెగా, ఇందిరాగాంధీ మనుమరాలిగా ప్రజాక్షేత్రంలోకి దిగుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : October 23, 2024 5:07 pm

Priyanka Gandhi

Follow us on

Priyanka Gandhi: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాహుల్, ప్రియాంక రావాలి.. రాహుల్‌ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టాలి.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలి.. వాళ్లు వస్తేనే పార్టీకి పూర్వ వైభవం వస్తుంది.. పదేళ్ల క్రితం వరకు పార్టీ సీనియర్ల నినాదం ఇది. ఈ నినాదంతో రాహుల్‌ రాజకీయాల్లో వచ్చారు. కానీ, ఇందిర మనుమడిని, రాజీవ్‌ తనయుడిని అని నిరూపించుకోలేకపోయారు. పార్టీని నడిపించడంలో విఫలమయ్యారు. ప్రజాప్రతినిధిగా కూడా మెప్పించలేకపోయారు. పదేళ్లలో రాహుల్‌లో రాజకీయ చైతన్యం పెరిగినా.. పార్టీని గెలిపించే స్థాయికి చేరలేదు. దీంతో వరుసగా ఆయన సారథ్యంలో రెండు లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్న కాంగ్రెస్‌ పార్టీకి కేంద్రంలో అధికారం దక్కలేదు. ఈ క్రమంలో రాజీవ్‌గాంధీ తనయ, ఇందిర మనుమరాలు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. వయనాడ్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నారు. ఆమె గాంధీ వారసురాలిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పవర్‌ చూపుతుందా.. ఇందిర వారసురాలిగా మెప్పిస్తుందా అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతుంది.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల నుంచే..
ప్రియాంక గాంధీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్‌ ప్రచారానికి బాధ్యత వహించారు. రాజకీయాల్లోకి అధికారికంగా ప్రవేశించినా ఎన్నికల సమరంలోకి దిగలేదు. రాహుల్‌గాంధీ విజయం సాధించి రాజీనామా చేసిన వయనాడ్‌ నుంచి ఇప్పుడు పోటీ చేయడం ద్వారా ఎన్నికల సమరంలోకి దిగుతున్నారు. పలువురు కాంగ్రెస్‌ పెద్దల సమక్షంలో ఆమె వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రియాంక గాంధీ దశాబ్దాల రాజకీయం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వర్చారు. ముత్తాత పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ మాజీ ప్రధాని, తండ్రి రాహుల్‌ గాంధీ మాజీ ప్రధాని, తల్లి సోనియాగాంధీ ప్రతిపక్ష నేత, అన్న రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నేత. నెహ్రూ వారసత్వాన్ని ఇందిర కొనసాగించారు. ఇందిర వారసత్వాన్ని రాజీవ్‌ కొనసాగించారు. రాజీవ్‌ వారసత్వాన్ని కొనసాగించడంలో రాహుల్‌ తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక పార్టీ నేతలకు ఆశాదీపంగా మారారు.

నానమ్మ, నాన్న హత్య..
ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ 1984లో హత్యకు గురయ్యారు. అప్పుడ ప్రియాంక వయసు 12 ఏళ్లు. గంగరక్షకులు ఇందిరను కాల్చి చంపారు. ఇక ఆ దుఃఖం నుంచి తేరుకోక మేందు తండ్రి రాజీవ్‌గాంధీ ఆత్మాహుతి దాడిలో మరణించాడు. శ్రీపెరంబదూర్‌లో ఈ ఘటన జరిగింది. అప్పుడు ప్రియాంక వయసు 19 ఏళ్లు. చిన్న వయసులోనే తల్లి, సోదరుడికి అండగా నిలిచింది. ఇక ఇందిరాగాంధీ పోలికలు పుణికి పుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తే నానమ్మ వారసత్వం నిలబెడుతుందని అప్పటి నుంచి చాలా మంది భావిస్తున్నారు. కానీ అనూహ్యంగా సోనియాగాంధీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టారు. ప్రియాంక 25 ఏళ్ల వయసులో వ్యాపార వేత్త రాబర్ట్‌ వాద్రాను పెళ్లి చేసుకున్నారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

1990లోనే తెరవెనుక రాజకీయాలు..
ఇక 1990 దశకంలో కాంగ్రెస్‌ తీవ్ర కష్టాలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌కు అండగా నిలిచారు. తెర వెనుక రాజకీయాలు చేశారు. తల్లి, సోదరుడికి మద్దతుగా నిలిచారు. అపుపడప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో రాజకీయ చతురత అందరినీ ఆకట్టుకుంది. క్రమంగా పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా మారారు.

రాజకీయ పరిణతి..
ఇక ప్రియాంక గాంధీ ఎన్నిల సమయంలో ప్రొటోకాల్‌ పక్కన పెట్టి పేదల వద్దకు వెళ్లి కలవడం, వారితో ఆడి పాడడం, హత్తుకోవడం, పిల్లలను ఎత్తుకోవడం వంటి కార్యక్రమాలతో పేదలకు మరింత దగ్గరయ్యారు. ప్రజా సమస్యలపై జరిగే ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు దగ్గరయ్యారు. దీంతో రాహుల్‌ కన్నా ఎక్కువ రాజకీయ పరిణతి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. 2008లో తన తండ్రి రాజీవ్‌ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినిని జైలులో కలుసుకోవడం, క్షమాభిక్షపై అభ్యంతరం తెలుపకపోవడం ద్వారా మహిళలపై తనకు ఉన్న ఉదారతను చాటుకున్నారు. ఇక రాయబరేలీలో తన సోదరుడిని, అమేథీలో మంత్రి స్మృతి ఇరానీపై కిషోరీలాల్‌ శర్మను గెలిపించి తన ప్రతిష్టను మరింత పెంచుకున్నారు.

కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా..
ఈ క్రమంలో 2019లో ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 80 ఏళ్ల కాంగ్రెస్‌ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారని ప్రచారం జరిగింది. వారణాసిలో నరేంద్రమోఈపైనా పోటీ చేస్తారని భావించారు. కానీ, అవేవీ జరుగలేదు. 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేశారు. కానీ గెలిపించలేకపోయారు. దీంతో ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావాలని పోస్టర్లు కూడా వెలిశాయి. చివరకు కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీకి సిద్ధమయ్యారు అనేక సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య దేశాన్ని ఏళిన శక్తివంతమైన మహిళగా ఖ్యాతి దక్కించుకున్న ఇందిరమ్మ వారతస్వాని ప్రియాంక ఏమేరకు నిలబెడతుంది. ప్రజల ఆదరణను చూరగొంటుందా.. మహుళ ప్రజాదరణ నేతగా ఎదుగుతుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.