https://oktelugu.com/

Allu Arjun : రేపు ప్రెస్ మీట్ లో బాంబు పేల్చనున్న అల్లు అర్జున్..మెగా ఫ్యాన్స్ కి గట్టి షాక్..వివాదం తారాస్థాయికి చేరనున్నాయా?

గడిచిన నాలుగు నెలల నుండి అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో సోషల్ మీడియాలో గొడవలు జరుగుతున్నాయి. అదే విధంగా అల్లు అర్జున్ మావయ్య కూడా పవన్ కళ్యాణ్ ని తప్పుబట్టడం, ఆ తర్వాత జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం వంటివి జరిగాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 23, 2024 / 05:03 PM IST

    Allu Arjun Press meet

    Follow us on

    Allu Arjun :  : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమేరకు ఆయన మూవీ టీంతో అధికారిక ప్రకటన చేయించాడు. ఆయన యూట్యూబ్ ఛానల్ లో కూడా ఈ ఈవెంట్ ని షెడ్యూల్ చేయబడింది. డిసెంబర్ నెలలో విడుదల అవ్వబోతున్న ‘పుష్ప 2 : ది రూల్’ కి సంబంధించిన ఒక కీలక ప్రకటన ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియచేయబోతున్నాడు అల్లు అర్జున్. ఆయనతో పాటు డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు కూడా హాజరు కాబోతున్నారు. అయితే అల్లు అర్జున్ ఇలా మీడియా ముందుకు వచ్చి చాలా కాలం అయ్యింది. పలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో పాల్గొన్నాడు కానీ, మీడియా ముందుకు మాత్రం రాలేదు. నంద్యాల ఘటన తర్వాత అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో, మెగా అభిమానుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిన సంగతి తెలిసిందే.

    గడిచిన నాలుగు నెలల నుండి అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో సోషల్ మీడియాలో గొడవలు జరుగుతున్నాయి. అదే విధంగా అల్లు అర్జున్ మావయ్య కూడా పవన్ కళ్యాణ్ ని తప్పుబట్టడం, ఆ తర్వాత జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం వంటివి జరిగాయి. ఈ వివాదం ముదురుతూనే ఉంది కానీ, తగ్గడం లేదు. అయితే మీడియా ముందుకు వచ్చాడు కాబట్టి, కచ్చితంగా రిపోర్టర్స్ ఆయన్ని నంద్యాల ఘటన తర్వాత జరిగిన పరిణామాల గురించి ప్రశ్నలు అడుగుతారు. దానికి ఆయన గొడవని తగ్గించే రీతిలో సమాధానం చెప్తాడా?, లేకపోతే పెంచే విధంగా సమాధానం చెప్తాడా అనేది చూడాలి. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అయితే, గొడవల్ని తగ్గించే విధంగానే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అదే విధంగా తెలుగు లో భారీగా ఏర్పాటు చేయబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథి గా ఆహ్వానించే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

    ఇందులో ఎంతమాత్రం నిజానిజాలు ఉన్నాయో రేపటి ప్రెస్ మీట్ తో తేలనుంది. ఇదంతా పక్కన పెడితే పుష్ప చిత్రం డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు అధికారిక ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు డిసెంబర్ 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇది చెప్పేందుకే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేస్తున్నారట. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్ కూడా పూర్తి చేసారు. సెకండ్ హాఫ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. త్వరలోనే ఐటెం సాంగ్ ని చిత్రీకరించబోతున్నారు. నవంబర్ మొదటి వారం లోపు మొదటి కాపీ సిద్ధంగా ఉంటుందట. ఇక ఆ తర్వాత నుండి అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో ప్రొమోషన్స్ చేయబోతున్నాడు.