Jagan: అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Womens Day) సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు, ప్రతిపక్ష నేతలు, మాజీ ముఖ్యమంత్రులు మహిళలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇందులో ఏసీ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెరలేపింది.
Also Read: POK స్వాధీనం దిశగా మోడీ సర్కార్ అడుగులు.. కార్గిల్ సెక్టార్ లో ఎలాంటి ప్లాన్ అమలు చేస్తోందంటే..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి(Revnath Reddy), చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఆయా రాష్ట్రాల మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేతలు, మాజీ సీఎంలు కేసీఆర్(KCR), జగన్‌మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) కూడా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన ఓ ట్వీట్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ట్వీట్‌లో మహిళలకు తాము గొప్పగా సేవ చేశామని, ఆర్థికంగా బలోపేతం చేశామని పేర్కొన్నారు. ఇక నంచి క ఊడా తన రాజకీయం.. అంటే భవిష్యత్‌లోనూ తనది మహిళాభ్యుదయమే అని రాసుకొచ్చారు. అయితే ఐదేళ్లలో మహిళలకు ఏం చేశారో తెలియాలి. కానీ, ఆయన కుటుంబంలో మహిళలకు మాత్రం అభ్యుదయం లేకుండా పోయింది అని చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు.
ఆస్తి కోసం…
జగన్ ఆస్తి కోసం తల్లిని కోర్టుకు లాగారు. చెల్లికి ఆస్తి చెల్లించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో జగన్ మహిళా దినోత్సవ ట్వీట్ కామెడీగా ఉందని అధికార టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ మోహన్‌రెడ్డి అబద్ధాలు చెబుతూ తనకు చెందిన సరస్వతి పవర్(Saraswathi Power)ను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె తల్లి ఎన్సీల్టీ కోర్టుకు తెలిపింది. చెల్లి ఆస్తులను పంచుతానని నాన్నకు మాట ఇచ్చి ఇప్పుడు కోర్టుకు లాగారు. ఇక వీరిపై వైసీపీ సోషల్ మీడియా చేసిన అరాచక వ్యాఖ్యల గురించి చెప్పాల్సిన పనిలేదు.
మరో చెల్లికి కూడా..
ఇక మరో చెల్లి, ఎస్.వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి(Sunitha Reddy)కి కూడా జగన్ తీరని అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. ఆమె తండ్రిని చంపించింది జగనే అని ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని వేడుకుంటే ఆమెపైనే హత్యకేసు బనాయించే ప్రయత్నం చేశారు. అయినా జగన్ మహిళాభ్యుదయమే తన లక్ష్యం అని ట్వీట్ చేయడం విమర్శలకు తావిస్తోంది. కుటుంబంలో కానరానీ, అభ్యుదయం రాష్ట్ర మహిళల్లో ఎలా కనిపిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి కానీ, ఇంట్లో కుంపటి పెట్టుకుని బయటి మహిళలను అక్కలు చెల్లెళ్లు, తల్లులు అని పిలవడం జగన్‌కే చెల్లింది.
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. “మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుంది’’ అని గట్టిగా నమ్మే వ్యక్తిని. ఆ దిశలోనే మన ప్రభుత్వ కాలంలో మహిళల అభ్యున్నతి, సాధికార…
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2025