Cricketers Wedding : మీడియా పెళ్ళిళ్ళు : మొన్న సానియా-షమీకి.. ఈరోజు ఈ ప్రముఖ క్రికెటర్లకు..

Cricketers Wedding : మీడియాలో వచ్చిన వార్తలు వారిని ఏ స్థాయిలో ఇబ్బందికి గురి చేశాయో అర్థం చేసుకోవచ్చు. సానియా మీర్జా, మహమ్మద్ షమీ పెళ్లి ఎపిసోడ్ ముగిసిన తర్వాత..

Written By: Anabothula Bhaskar, Updated On : June 26, 2024 9:55 pm

Shikhar Dhawan, Mithali Raj

Follow us on

Cricketers Wedding : ఆ మధ్య ఓ ప్రముఖ క్రీడాకారుడు తన భార్య నుంచి కేసులు ఎదుర్కొన్నాడు. ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడు కోర్టు మెట్లు ఎక్కాడు. ఆ తర్వాత కోర్టు నుంచి ఊరట పొందాడు. ఇక మరో క్రీడాకారిణి క్రీడాకారుడైన తన భర్త నుంచి విడాకులు తీసుకుంది.. తన ఒక్కగానొక్క కొడుకుతో కలిసి జీవిస్తోంది. పైగా ఆమె తన అంతర్జాతీయ కెరియర్ కు వీడ్కోలు పలికింది. అయితే అ క్రీడాకారుడు, క్రీడాకారిణి.. ఏదో ఫంక్షన్ లో కలిశారు. కాసేపు కలివిడిగా మాట్లాడుకున్నారు. అంతే మీడియాలో ప్రముఖంగా ఫోటోలు ప్రచురితమయ్యాయి. వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు ప్రసారమయ్యాయి.. దీంతో షాక్ అవడం వారిద్దరి వంతయింది.. “మేము బురద చల్లుతాం.. కడుక్కోవడం మీ ఖర్మ” అనే రేంజ్ లో మీడియా వ్యవహరించడంతో.. చివరికి ఆ క్రీడాకారిణి తండ్రి స్పందించక తప్పలేదు.

పైన చెప్పిన వృత్తాంతం మొత్తం టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ మధ్య జరిగింది. “మా బతుకులేవో బతకనివ్వండి. ఇలా మాకు తెలియకుండానే మా పెళ్లి జరిపించకండి. కనీసం మా పెళ్ళికైనా మమ్మల్ని పిలవండి. పెళ్లి అనేది నలుగురి మధ్య జరుపుకునే వేడుక. అదేదో రహస్యంగా నిర్వహించుకునేది కాదని” సానియా మీర్జా,మహ్మద్ షమీ వేరువేరుగా తమ అంతరంగీకుల వద్ద వాపోయారంటే మీడియాలో వచ్చిన వార్తలు వారిని ఏ స్థాయిలో ఇబ్బందికి గురి చేశాయో అర్థం చేసుకోవచ్చు. సానియా మీర్జా, మహమ్మద్ షమీ పెళ్లి ఎపిసోడ్ ముగిసిన తర్వాత.. మీడియా మళ్లీ ఇప్పుడు శిఖర్ ధావన్, మిథాలీ రాజ్ చుట్టూ తిరుగుతోంది.

తాజాగా ఇదే విషయాన్ని శిఖర్ ధావన్ పంచుకున్నాడు. జియో సినిమాలో ప్రసారమయ్యే “ధావన్ కరేంగే” అనే కార్యక్రమంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెప్పుకొచ్చాడు..” నాకు మీడియా పెళ్లి చేసింది. నేను భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నానని విన్నాను. ఆశ్చర్యమేంటంటే ఆ పెళ్లి నిశ్చయించిన విషయం కూడా నాకు తెలియదు. కనీసం మిథాలీ రాజ్ కైనా తెలుసో, లేదో” అని చమత్కరించాడు. మిథాలీ 2022 ప్రపంచ కప్ లో భాగంగా క్రైస్ట్ చర్చ్ వేదికగా దక్షిణాఫ్రికా తో తన చివరి మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ మహిళా జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తోంది. ఇక శిఖర్ ధావన్ ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. భారత క్రికెట్ జట్టులోకి వచ్చిన తొలి నాళ్లల్లో అతడు ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాముఖర్జీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆయేషా కు అంతకు ముందే వివాహం జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భర్త ద్వారా విడాకులు తీసుకున్న తర్వాత ఆయేషా – శిఖర్ వివాహం చేసుకున్నారు. ఆయేషా – శిఖర్ దంపతులకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు..2020 ఆగష్టు 8 నుంచి ఆయేషా – శిఖర్ విడివిడిగా ఉంటున్నారు. 2023 అక్టోబర్ నెలలో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. తన కొడుకును తన వద్దకు పంపించే ఏర్పాట్లు చేయాలని కోర్టుకు విన్నవించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మరో వైపు ఐపీఎల్ లోనూ శిఖర్ ధావన్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఈ సీజన్ లో గాయాల కారణంగా శిఖర్ చాలా మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు.