PM Modi AP Tour: ఆంధ్రప్రదేశ్‌లో బలపడేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు అధిష్టానం ఆదేశాలతో అడుగులు వేస్తున్న కమలం నేతలు కొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రులు రాష్ట్రంలో వీలైనంత ఎక్కువగా పర్యటించేలా ఏపీ బీజేపీ నాయకత్తం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో జూలైన 4న ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఖరారైంది. ఇప్పటికే కేంద్ర మంత్రుల పర్యటన షురూ కాగా, తాజాగా ప్రధాని రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్టీ మైలేజీ పెరిగేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఆశించిన స్థాయిలో బీజేపీకి మైలేజీ రాలేదు. దీంతో ప్రతీ ఎన్నికల్లోనూ పార్టీకి పరాభవం తప్పడం లేదు. ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా బీజేపీ జాతీయ నాయకత్వం సరికొత్త వ్యూహం రచిస్తోంది. కేంద్ర నాయకత్వం ఆదేశాలతో రాష్ట్ర పార్టీ నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కేంద్ర మంత్రులు పర్యటించారు. విభజన చట్టంలోని హామీలు, బీజేపీ ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి చేసిన నిధులు, నెరవేర్చిన హామీలను మంత్రులు వివరిస్తున్నారు రాష్ట్ర పథకాల్లో కేంద్రం వాటా ఎంత ఉంది, ఎంతమందికి లబ్ధి చేకూరింది అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రులు రాష్ట్ర లో పర్యటించిన సందర్భంలో ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకుని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రజల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నారు.
Also Read: Telangana- AP Assembly Delimitation: విభజన చట్టంలో కదలిక.. నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు!
పార్టీలో సంస్థాగత మార్పులు..
ప్రజల అభిప్రాయం, పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీలో సంస్థగత మార్పులు కూడా చేసే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు జిల్లాల వారీగా పదాధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ పార్టీలైన్ ఏంటి.. పొలిటికల్ వ్యూ ఎలా ఉండబోతుంది. రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్తుంది అని పదాధికారులకు వివరిస్తున్నారు. ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా బలపడబోతున్నామన్నా సంకేత్రాలను క్యాడర్‌కు ఇస్తున్నారు.

ప్రధాని పర్యటనతో జోష్ వచ్చేనా?
కాగా కేంద్ర మంత్రుల పర్యటనల ద్వారా పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన బీజేపీ నాయకత్వం ప్రధాని పర్యటనతో క్యాడర్‌లో జోష్ పెరుగుతుందని భావిస్తోంది. ఈమేరకు రాష్ట్రంలో ఏం మాట్లాడాలు, ఏయే అంశాలు ప్రస్తావించాలి అని పార్టీ నాయకత్వం ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ట్లు తెలుస్తోంద. క్యాడర్‌లో ఉత్సాహం నింపేలా ప్రధాని ప్రసంగాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలను ఎండగట్టే అవకాశమూ ఉన్నట్లు సమాచారం. జూలై 4న ప్రధాని పర్యటన తర్వాత రాష్ట్రంలో పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. అయితే ఏళ్లుగా ఏపీలో మారని పార్టీ పరిస్థితి ప్రధాని పర్యటనతో మారుతుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:BJP- Pawan Kalyan: బీజేపీ ‘పవర్’ పాలిటిక్స్.. ఏపీలో పవన్‌ను ఇరుకున పెట్టే చర్యలు!