https://oktelugu.com/

NTR Sensational Decision: స్క్రిప్ట్ విషయం లో కొరటాల గందరగోళం..సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్

NTR Sensational Decision: టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊపు ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..నిన్న మొన్నటి వరుకు కేవలం తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఎన్టీఆర్, ఈ ఏడాది విడుదలైన #RRR సినిమా తో ప్రపంచవ్యాప్తంగా అన్నీ బాషల వారికి పరిచయం అయ్యాడు..అంతటి క్రేజ్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కొరటాల శివ తో చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2022 / 04:00 PM IST
    Follow us on

    NTR Sensational Decision: టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊపు ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..నిన్న మొన్నటి వరుకు కేవలం తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఎన్టీఆర్, ఈ ఏడాది విడుదలైన #RRR సినిమా తో ప్రపంచవ్యాప్తంగా అన్నీ బాషల వారికి పరిచయం అయ్యాడు..అంతటి క్రేజ్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కొరటాల శివ తో చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవ్వడం తో సాధారణంగానే అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఉండడం సహజం..కానీ ఇటీవల కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదలై భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..దీనితో కొరటాల శివ తో సినిమా అనగానే ఎన్టీఆర్ అభిమానుల్లో కాస్త భయం మొదలైంది..కానీ ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన మోషన్ టీజర్ కాన్సెప్ట్ చూసిన తర్వాత అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

    Koratala Siva

    Also Read: Pakka Commercial: పక్కా కమర్షియల్ మూవీ హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు వసూలు చెయ్యాలో తెలుసా?

    అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయం లో కొరటాల ఇంకా సంతృప్తి చెందలేదట..ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ నచ్చినప్పటికీ కూడా కొరటాల స్క్రిప్ట్ మీద రీ వర్క్ చెయ్యడానికి మరింత సమయం అడిగాడట..అందుకే ఇప్పటి వరుకు ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా ప్రారంభం కాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..ఇక ఇటీవలే స్క్రిప్ట్ కి రిపేర్లు చేసిన తర్వాత ఎన్టీఆర్ కి ఫైనల్ న్యారేషన్ ఇచ్చాడట..అయితే కొరటాల చేసిన రీ వర్క్ ఎన్టీఆర్ కి పెద్దగా నచ్చలేదట..ముందు అనుకున్న స్క్రిప్ట్ తోనే షూటింగ్ ప్రారంభిద్దాం అని కొరటాల కి చెప్పాడట ఎన్టీఆర్..కానీ కొరటాల కి మాత్రం ఇంతకు ముందు అనుకున్న స్క్రిప్ట్ మీద బలమైన నమ్మకం రావడం లేదు..దీనితో మరికొంత సమయం కావాలని ఎన్టీఆర్ ని అడిగాడట కొరటాల శివ..ఈసారి స్క్రిప్ట్ సరిగ్గా కుదరకపోతే ఈ ప్రాజెక్ట్ ని ప్రస్తుతానికి పక్కన పెట్టి ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు కి ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది..బుచ్చి బాబు జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు ని సిద్ధం చేసుకొని ఎప్పటి నుండి సిద్ధంగా ఉన్నాడు..కానీ కొరటాల శివ ప్రాజెక్ట్ కోసం ఈ సినిమాని హోల్డ్ లో పెట్టాడు..ఇప్పుడు కొరటాల ఇంకా ఎక్కువ సమయం వృధా చేస్తే ఆ సినిమాని ఆపేసి పనిలో ఎన్టీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది..ప్రస్తుతానికి ఫిలిం నగర్ లో ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న టాక్ ఇదే.

    N T Rama Rao

    Also Read: Anasuya Bharadwaj: సుధీర్, ఆది బాటలో అనసూయ.. మల్లెమాలకు, ఈటీవీకి పెద్ద దెబ్బనే?

    Tags