Telangana- AP Assembly Delimitation: తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి పార్లమెంట్ ఆమోదించి ఎనిమిదేళ్లు గడిచింది. ఈ చట్టం ద్వారానే ఆధ్రప్రదేశ్, తెలంగాణ విభజన జరిగింది. ఈ చట్టం ప్రకారం.. రాష్ట్రాల సరిహద్దుల నిర్వహణ, ఆస్తులు, అప్పులను విభజించడం, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ శాశ్వత రా«జధానిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లు తాత్కాలిక రాజధానిగా ఉంటుంది. ఈ చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగాలి. కానీ ఎనిమిదేళ్లు పూర్తయినా నియోజకవర్గాల పునర్విభజన జరుగలేదు. జల వివాదాలు పరిష్కారం కాలేదు. నియోజకవర్గాల పునర్విభజనపై 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం కొంత హడావుడి చేసింది. నియోజకవర్గాల సంఖ్య పెంచాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నోరు మెదపలేదు. దీంతో కేంద్రం కూడా నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని పక్కన పెట్టింది.
తాజాగా కేంద్రం చొరవతో కదలిక…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. కానీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విభజన జరుగకపోవడమే మేలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెండేళ్లలో విభజన జరుగకపోతే చట్టం చెల్లుబాటు గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ప్రభుత్వాతు స్తబ్ధుగా ఉన్న నేపథ్యంలో కేంద్రమే దీనిపై చొరవ చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈమేకు నియోజకవర్గాల పునర్విభజన కోసం అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టు పంపించాలని ఇటీవల కేంద్రం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది.
Also Read: BJP- Pawan Kalyan: బీజేపీ ‘పవర్’ పాలిటిక్స్.. ఏపీలో పవన్‌ను ఇరుకున పెట్టే చర్యలు!
కేంద్రం చొరవకు కారణం ఏంటి?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాదిన పాగా వేయాలని చూస్తోంది. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగితే తమకు లాభం జరుగుతుందని భావిస్తోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో బీజేపీ కొంత ఊపుమీద ఉన్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో ఇప్పుటు కాకుంటే ఎప్పుడూ కాదు అన్నట్లుగా బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నిల్లో అధికారంలోకి రావడంపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలోనే జూలై 2, 3 తేదీల్లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలు విభజన ద్వారా రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, వైసీపీలను బలహీనపర్చే చర్యల్లో భాగంగానే తాజాగా నియోజకవర్గాల విభజనపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
విభజన జరిగితే ఇలా..
కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలను 153కు పెరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు 225కు పెరుగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీకి అయినా కనీస మెజారిటీ 60. అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగితే ఏ పార్టీ అయినా సాధారణ మెజారిటీ కోసం ఎన్నికల్లో 95 సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాట్లుకు 110 అసెంబ్లీ స్థానాలు కావాలి. అసెంబ్లీ స్థానాలను 225కు పెంచితే మెజారిటీ కోసం పార్టీలు 140 సీట్లు గెలవాల్సి ఉంటుంది.
ఎంతుకీ తాత్సారం..
తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నియోజకవర్గాల పునర్విభజనపై కావాలనే తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో గెలవడానికి భారీగా ఖర్చు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల ఖర్చు అభ్యర్థులకు తడిసి మోపెడవుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నియోజకవర్గాలు పెంచితే ఈ భారం మరింత పెరుగుతోందని భావిస్తోంది. దీంతో పెంపు అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇదివరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ నియోజకవర్గాల పెంపును పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలు పెంచితే ఎన్నికల సమయంలో ఖర్చు విపరీతంగా పెరుగుతాయని భావిస్తున్నాయి. కానీ దక్షిణాదిన పాగా వేయాలని చూస్తున్న బీజేపీ మాత్రం విభజన తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. రాష్ట్రాలో అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టు ఇస్తే నియోజకవర్గాల పెంపు ప్రక్రియ చకచకా జరిగే అవకాశం ఉంది.
Also Read:Amaravati: టీడీపీ నేతలు తగ్గితేనే ‘అమరావతి’ సజీవం.. లేకుంటే కష్టమే..