https://oktelugu.com/

Modi Comments on Agneepath scheme: అగ్నిపథ్ పై లోపల ఉన్నదంతా కక్కేసిన మోడీ..

Modi Comments on Agneepath scheme: ‘చాలా నిర్ణయాలు మొదట్లో తప్పుగా, అన్యాయంగా కనిపిస్తాయి.కాలక్రమేణా అవే దేశాభివ్రుద్ధికి దోహదం చేస్తాయి. మంచి ఉద్దేశ్యాలతో పెడుతున్న పథకాలు కూడా రాజకీయాల్లో చిక్కుకుంటున్నాయి’..అగ్నిపథ్ పై పరోక్షంగా దేశ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలివి. ప్రభుత్వం ప్రజలకు రూ.100 ఇస్తే పతాక శీర్షికన వార్త అవుతుందని.. అదే వారి భవిష్యత్ కోసం రూ.200 ఆదా చేస్తే మాత్రం విమర్శలపాలవుతున్నామని ఆయ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా పెల్లుబికుతున్న నిరసనలు, […]

Written By:
  • Dharma
  • , Updated On : June 21, 2022 / 09:45 AM IST
    Follow us on

    Modi Comments on Agneepath scheme: ‘చాలా నిర్ణయాలు మొదట్లో తప్పుగా, అన్యాయంగా కనిపిస్తాయి.కాలక్రమేణా అవే దేశాభివ్రుద్ధికి దోహదం చేస్తాయి. మంచి ఉద్దేశ్యాలతో పెడుతున్న పథకాలు కూడా రాజకీయాల్లో చిక్కుకుంటున్నాయి’..అగ్నిపథ్ పై పరోక్షంగా దేశ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలివి. ప్రభుత్వం ప్రజలకు రూ.100 ఇస్తే పతాక శీర్షికన వార్త అవుతుందని.. అదే వారి భవిష్యత్ కోసం రూ.200 ఆదా చేస్తే మాత్రం విమర్శలపాలవుతున్నామని ఆయ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా పెల్లుబికుతున్న నిరసనలు, ఆగ్రహవేశాల నేపథ్యంలో బెంగళూరు పర్యటనలో ఉన్న ప్రధాని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే అగ్నిపథ్ పై అడుగడుగునా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నా.. అన్నింటినీ తోసిరాజని ‘అగ్నిపథ్‌’పై మోదీ సర్కారు అడుగు ముందుకే వేసింది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం.. అగ్నిపథ్‌లో భాగంగా ఆర్మీలో పలు పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. అగ్నివీరుల అర్హతలు, సర్వీసులో వారికి అందే వేతనాలు, ఇతర ప్రోత్సాహకాల గురించి ప్రస్తావిస్తూ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పేరిట ఈ నోటిఫికేషన్‌ విడులైంది. జూలై నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలవుతుందని అందులో పేర్కొన్నారు. అగ్నివీరుల సాధారణ, సాంకేతిక, కార్యాలయ క్లర్కు/ స్టోర్‌ కీపర్‌, ట్రేడ్స్‌మన్‌ (సాయుధ) విధులకు వయసు, విద్యాపరమైన అర్హతలను అందులో ప్రకటించారు. దీని ప్రకారం.. పది, ఎనిమిదో తరగతి ఉత్తీర్హులైనవారికి ప్రత్యేక ర్యాలీలు నిర్వహించి ట్రేడ్స్‌మన్‌ కేటగిరీలో సర్వీసులోకి తీసుకుంటారు. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం ఆర్మీ అభ్యర్థులు సైనిక చట్టం- 1950 కింద తమ పేర్లు నమోదు చేసుకోవాలి. శిక్షణతో కలుపుకొని మొత్తం సర్వీసు నాలుగేళ్లు. భూ, సముద్ర, గగనతల విభాగాల్లో ఎక్కడైనా పనిచేయడానికి అగ్నివీరులు సిద్ధపడాలి. సర్వీసు పూర్తిచేసుకున్నవారికి పింఛను, గ్రాట్యుటీ ఇవ్వరు.

    Modi

    భిన్నమైన ర్యాంకింగ్స్..
    ప్రస్తుత ర్యాంకులకు భిన్నమైన హోదాను అగ్నివీరులకు కల్పిస్తారు. ఎన్‌రోల్‌ అయిన రోజునుంచే సర్వీసును లెక్కిస్తారు. సెలవులు, యూనిఫామ్‌లు, వేతనాలు, అలవెన్సు లు భారత ప్రభుత్వ నిర్దేశాలమేరకు అగ్నివీరులకు ఈ నాలుగేళ్లూ అందుతాయి. వైద్య పరీక్షలు, దారుఢ్య, లిఖత, క్షేత్రస్థా యి పరీక్షలకు ఎప్పటికప్పుడు అగ్నివీరులు హాజరు కావాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాగా.. దేశవ్యాప్తంగా సెగలు రేపుతున్న ‘అగ్నిపథ్‌’పై ప్రధాని మోదీ తొలిసారి పరోక్షంగా స్పం దించారు. ‘‘కొన్ని నిర్ణయాలు ఇప్పుడు నిర్హేతుకంగా కనిపించవచ్చు. కానీ కాలక్రమంలో జాతి నిర్మాణానికి తోడ్పడతాయు’’ అని ఆ పథకం పేరు ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యానించారు. రెండ్రోజుల కర్ణాటక పర్యటనలో భాగంగా సోమవారం ఆయన బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టు సహా పలు పథకాలను జాతికి అంకితం చేశారు. అనంతరం కొమ్మఘట్ట లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘కరునాడ జనతిగె నన్న ప్రీతియ నమస్కారాలు’ అంటూ కన్నడలో ప్రసంగం ప్రారంభించి ఆకట్టుకున్నారు. ‘21వ శతాబ్దపు భారతదేశం.. సంపద-ఉద్యోగాల సృష్టికర్తలకు, నవీన ఆవిష్కర్తలకు చెందుతుంది. వీరే దేశానికి నిజమైన బలం.
    గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోంది. స్టార్టప్‌, ఆవిష్కరణల పథం అంత తేలికైనది కాదు. సంస్కరణల మార్గం మా త్రమే మనల్ని కొత్త లక్ష్యాలు. కొత్త సంకల్పం వైపు నడిపిస్తాయి. దశాబ్దాలుగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రక్షణ, ఇతర రం గాల్లో అవకాశాలకు తలుపులు తెరిచాం’ అని మోదీ చెప్పారు.

    భారత్ బంద్..
    .వరుస ఆందోళనల తర్వాత కూడా అగ్నిపథ్‌ పథకంపై కేంద్రం ముందుకే వెళ్తుండటంతో నిరసనలను తీవ్రతరం చేస్తూ కొన్ని సంఘాలు ఇచ్చిన ‘భారత్‌ బంద్‌’ పిలుపుతో కేంద్రం అప్రమత్తమైంది. దాదాపు 500 రైళ్లను రద్దు చేసిం ది. కాగా.. సామాజిక మాధ్యమాల వేదికగా బంద్‌కు అనుకూలంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్దఎత్తున యువత సమీకృతమైంది. పలు రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్థులు, యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు జాతీయ రహదారులను దిగ్బంధించారు. భద్రతా బలగాలతో ఎక్కడికక్కడ బాహాబాహీకి తలపడ్డారు. ఘర్షణలు చేయి దాటిపోయిన చోట్ల పెద్దఎత్తున హింస జరిగింది. అటు బంద్‌.. ఇటు కాంగ్రెస్‌ అగ్రనేతలు ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించిన సత్యాగ్రహంతో దేశ రాజధానిలో ట్రాఫిక్‌ కుదేలైంది. ఢిల్లీ నగరం, సరిహద్దు ప్రాంతాల్లోని కీలక వాణిజ్య రహదారి ఢిల్లీ- గుర్గామ్‌ ఎక్స్‌ప్రె్‌సవే సహా పలు పై వంతెనలు, హైవేలపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

    Also Read: Agnipath Protest in Secunderabad: సికింద్రాబాద్ విధ్వంసకాండ: రిమాండ్ రిపోర్ట్ లో సంచలనాలు.. ప్రధాన నిందితుడెవరంటే?

    కట్టుదిట్టమైన భద్రత..
    సరిహద్దుల్లో పోలీసు తనిఖీలతో నిలిచిపోయి బారులు తీరిన వాహనాలు రోజంతా చిన్నగా కదులుతూనే ఉన్నాయి. సత్యాగ్రహంలో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌, రాజ్యసభపక్ష కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గే, లోక్‌సభ పక్ష కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, ఆర్మీ అభ్యర్థులు హరియాణాలో పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. వీరిలో ఒక శ్రేణి ఫతేహాబాద్‌లోని లాల్‌బట్టి చౌక్‌ మార్గాన్ని దిగ్బంధించింది. ఆందోళనల నేపథ్యంలో రోహ్‌టక్‌ జిల్లాలో హింస ప్రజ్వరిల్లింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో హింసాత్మక అల్లర్ల దృష్ట్యా తెలంగాణ పరిధిలోని అన్ని స్టేషన్ల లోపల, వెలుపల భారీసంఖ్యలో బలగాలను మోహరించారు. బంద్‌ను దృష్టిలో ఉంచుకుని కేరళ, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. నిరసనలు ఎగసిపడుతున్న ఉత్తరప్రదేశ్‌లో సుప్రీంకోర్టు ఆదేశాలు బుల్డోజర్లు ఆగిపోయినా.. కఠిన చట్టాలు అమలవుతూనే ఉన్నాయి. బంద్‌లతో శాంతికి భంగం కలిగించేవారిపై ఉక్కుపాదం తప్పదని యోగి ప్రభుత్వం హెచ్చరించింది. అల్లర్లకు ఆజ్యం పోస్తున్న సోషల్‌ మీడియాపై ఒక కన్నేయాలని పోలీసులకు పంజాబ్‌ సర్కారు ఆదేశాలు జారీచేసింది. వరుస హింసా ఘటనలు, బంద్‌ దృష్ట్యా బిహార్‌లోని పార్టీల కార్యాలయాలకు భద్రతను పెంచారు. 20 జిల్లాల పరిధిలో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. జార్ఖండ్‌లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

    Modi

    అగ్నిపథ్‌ ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 24వ తేదీన ఆందోళనలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు ఉద్యమించిన సంయుక్త కిసాన్‌ మోర్చా సోమవారం కర్నల్‌లో సమావేశమై.. ఈ నిర్ణయం తీసుకుంది. తాలూకా, జిల్లా కేంద్రాలన్నింటిలో శుక్రవారం జరిగే ఆందోళనల్లో యువత, రాజకీయ పార్టీలు, పౌర సంస్థలు పాల్గొనాలని మోర్చా నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ కోరారు. తొలుత ఈ నెల 30న నిరసన తెలిపాలని అనుకున్నప్పటికీ.. ఆందోళనలను లెక్కచేయకుండా కేంద్ర దూకుడు ప్రదర్శిస్తుండటంలో ముందే ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించామని ఆయన వివరించారు. కాగా, సంప్రదాయ సైనిక భర్తీకి అగ్నిపథ్‌ వ్యతిరేకంగా ఉన్నదంటూ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎమ్‌ఎల్‌ శర్మ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ వేశారు. అగ్నిపథ్‌ పథకాన్ని ప్రకటిస్తూ ఈ నెల 14వ తేదీన కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దుచేయాలని కోరారు. మరోవైపు.. అగ్నిపథ్‌ పథకం, దాని అమలుపై చర్చించేందుకు త్రివిధ దళాధిపతులు మంగళవారంనాడు ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

    Also Read:Bandi Sanjay: బీజేపీ సత్తా చాటాలని బండి సంజయ్ తాపత్రయపడుతున్నారా?

    Tags