PM Modi: తమిళనాడులోని కోనూరు సమీపంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సీడీఎస్ బిపిన్ రావత్ కు సైన్యంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. స్కూలింగ్ తరువాత సైన్యంలోకి అడుగుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. వృత్తిలో తనదైన శైలిలో ప్రతిభ చూపిస్తూ ఉన్నత శిఖరాలకు చేరారు. బాధ్యతల నిర్వహణలో క్రమశిక్షణతో ఉత్తమ పదవులు అందుకోవడంలో ఆయన చూపిన తెగువ అసామాన్యమైనదే.

2019లో పాకిస్తాన్ పై ఇండియా సర్జికల్ స్ర్టయిక్ చేసింది. జమ్ముకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో 40 మంది సైనికుల మృతికి కారణమైన పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో జరిపిన దాడికి బిపిన్ రావత్ ప్రధాన సూత్రధారి. దీంతో మనదేశం ప్రతిష్ట మరింత ఇనుమడించింది. అందుకేు ప్రధాని మోడీకి ఇష్టమైన వాడిగా బిపిన్ రావత్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పాక్ లోని బాలాకోట్ లో దాగున్న ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమంలో బిపిన్ రావత్ ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
2015లో 18 మంది భారత సైనికులను యూఎన్ఎఫ్ డబ్ల్యూ మిలిటెంట్లు దారుణంగా హతమార్చి మయన్మార్ పారిపోయారు. దీంతో భారత సైన్యం సరిహద్దులు దాటి వారిని మట్టుబెట్టింది. దీంతో వీటిలో బిపిన్ రావత్ ప్రణాళిక చక్కగా అమలు చేశారు. భారత సైన్యానికి దిశానిర్దేశం చేసి మిలిటెంట్లను తుదముట్టించడంలో బిపిన్ రావత్ కృషి ఉందని తెలుస్తోంది.
Also Read: Bipin Rawath: బిపిన్ రావత్ మరణం అనుమానాస్పదం.. బాంబు పేల్చిన సుబ్రహ్మణస్వామి
బిపిన్ రావత్ లో దేశభక్తి మెండుగా ఉంది. దేశ కీర్తిప్రతిష్టలు ఇనుమడించడంలో రావత్ పాత్ర ఎంతో ఉందని తెలుస్తోంది. సైన్యానికి ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తూ వారిలో పట్టుదల నింపుతూ పోరాడటంలో ఉద్యుక్తులను చేయడం అలవాటుగా మారింది. దీంతో బిపిన్ రావత్ జీవితం ఎందరికో ఆదర్శప్రాయమైంది. ఆయన బుధవారం తమిళనాడులోని వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళుతూ దుర్మరణం చెందడం గమనార్హం.
Also Read: Helicopter trips: కొండ ప్రాంతాల్లో హెలికాప్టర్ ప్రయాణాలు ప్రాణాంతకం..