HomeNewsAshoka Vanam lo Arjuna Kalyanam: 'ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా'.. అదిరాయి ఫుల్...

Ashoka Vanam lo Arjuna Kalyanam: ‘ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా’.. అదిరాయి ఫుల్ లిరిక్స్ !

Ashoka Vanam lo Arjuna Kalyanam: యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. కిరణ్ కోలా ఈ చిత్రానికి కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి ‘ఓ ఆడపిల్ల నువ్వర్ధం కావా..’ అని రిలీజ్ అయిన పాట బాగా ఆకట్టుకుంటుంది.

Also Read: పుష్ప మూవీలో ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయా.. లెక్కల మాస్ట‌ర్ లాజిక్ మిస్ అయ్యారే..!

Ashoka Ashoka Vanam lo Arjuna KalyanamVanam lo Arjuna Kalyanam
Ashoka Vanam lo Arjuna Kalyanam

పల్లవి:
మాటరాని మాయవా
మాయజేయు మాటవా
మాటులోని మల్లెవా
మల్లెమాటు ముల్లువా

వయ్యారివా కయ్యారివా
సింగారివా సింగానివా
రాయంచవా రాకాసివా
లే మంచులో లావా నీవా

ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా
నా జీవితంతో ఆటాడుతావా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా

బుజ్జి బుజ్జి బుగ్గల్లోన ఎరుపుని
కనుల పులిమావా..?
చిట్టి చిట్టీ చెక్కిళ్ళలో నునుపుని
నుదుటికియలేవా

ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా
ఆ ఆఆ ఆఆ ఆ

చరణం 1:
పది మంది చూస్తు ఉంటే
అడ్డడ్డే అమాయకంగా
ఒక్కరైనా లేకపోతే
అయ్యయ్యో మరో రకంగా
ఉంటూ నా ఎదనే తింటూ
ఈ కధనే సందేహంలో పడదోయకే
ఏంటో నీ ఇబ్బంది
చెప్పెయ్ ఏమౌతుంది
ఎట్టా అట్టా వెళ్ళిపోకే

తిక్కో టెక్కో… చిక్కో చుక్కో
అసలేదో ఒలిచి చెబుతావా
పట్టో బెట్టో… గుట్టో కట్టో
నిజమేదో చెవిన పడనీయ్ వా

ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నీతోటి స్నేహం సచ్చేటి సావా

చరణం 2:
బతిమాలడానికైనా
ఇదిగో తయారుగున్నా
బదులియ్యి నేటికైనా
బతికియ్ ఏదో విధాన

తాకే ఆ తెరపై దూకే ఓ మెరుపై
నాకై నవ్వే విసిరావే
తీరా నీ ముందుంటే
తీరేలా పొమ్మంటూ
తీరం దాచి తిరిగావే

తప్పో ఒప్పో… గొప్పో ముప్పో
తెలుపక, లొసుగులెడతావా..?
మంచో చెడ్డో… కచ్చో పిచ్చో
తెలియక, నసిగి నడిచేవా..?

ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
సంద్రాలనైన ముంచేటి నావా..!!

సినిమా: అశోకవనంలో అర్జున కళ్యాణం
మ్యూజిక్: జయ్ క్రిష్
లిరిక్స్: అనంత్ శ్రీరామ్
సింగర్: రామ్ మిర్యాల

Also Read: ఎన్టీఆర్ కి క్యాసినోకి లింక్ ఎలా.. ? వర్మ బాలయ్యకి ఏమి చెబుతాడో ?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

  1. […] Team India: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలంటారు. దక్షిణాఫ్రికాలో టీమిండియా ఓటమికి పలు కారణాలు ఉన్నాయి. టీమిండియా ఇటీవల పరాజయాల బాట పట్టింది. దీంతో విజయం దక్కడం లేదు. ఫలితంగా విదేశాల్లో ఎన్నో రికార్డులు సృష్టించిన భారత జట్టు ప్రస్తుతం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో అభిమానుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ కోల్పోయినా కనీసం వన్డే సిరీస్ అయినా గెలుచుకుని సత్తా చాటాలని భావించినా అది కూడా నెరవేరలేదు. దీంతో అప్రదిష్ట మూటగట్టుకుంది. […]

Comments are closed.

Exit mobile version