https://oktelugu.com/

Celebrities Secret Weddings: సీక్రెట్‌గా పెండ్లి చేసుకున్న సెల‌బ్రిటీలు ఎంద‌రో తెలుసా…?

Celebrities Secret Weddings: సినీ తార‌ల గురించి ఎలాంటి వార్త అయినా స‌రే ఇట్టే వైర‌ల్ అయిపోతుంది. వారికి సంబంధించిన చిన్న వార్త‌ల‌కే అంత క్రేజ్ ఉంటే.. ఇక పెండ్లి విష‌యం అంటే అభిమానుల‌కు పెద్ద పండుగే. మామూలుగానే పెండ్లి విష‌యంలో సెల‌బ్రిటీల మీద ఎన్నో రూమ‌ర్లు వ‌స్తుంటాయి. అయితే చాలామంది మాత్రం ఎవ‌రికీ తెలియ‌కుండ సీక్రెట్ గా పెండ్లి చేసుకుంటారు. అలా ఇప్ప‌టి వ‌ర‌కు ఎంద‌రు సీక్రెట్ గా చేసుకున్నారో చూద్దాం. టాలీవుడ్ లో మహేష్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2021 / 02:04 PM IST
    Follow us on

    Celebrities Secret Weddings: సినీ తార‌ల గురించి ఎలాంటి వార్త అయినా స‌రే ఇట్టే వైర‌ల్ అయిపోతుంది. వారికి సంబంధించిన చిన్న వార్త‌ల‌కే అంత క్రేజ్ ఉంటే.. ఇక పెండ్లి విష‌యం అంటే అభిమానుల‌కు పెద్ద పండుగే. మామూలుగానే పెండ్లి విష‌యంలో సెల‌బ్రిటీల మీద ఎన్నో రూమ‌ర్లు వ‌స్తుంటాయి. అయితే చాలామంది మాత్రం ఎవ‌రికీ తెలియ‌కుండ సీక్రెట్ గా పెండ్లి చేసుకుంటారు. అలా ఇప్ప‌టి వ‌ర‌కు ఎంద‌రు సీక్రెట్ గా చేసుకున్నారో చూద్దాం. టాలీవుడ్ లో మహేష్ బాబు, నమ్రత ఇలా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక అందాల తార శ్రీదేవి, ప్రొడ్యూర్ బోనీ కపూర్ సీక్రెట్ గా పెండ్లి చేసుకున్నారు.

    Celebrities Secret Weddings


    ఇక బెంగాల్ హీరోయిన్ నుస్రత్ జహాన్ సీక్రెట్ గా ట‌ర్కీలో నిఖిల్ జైన్ ను మ్యారేజ్ చేసుకుంది. కాగా ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ విడిపోయారు. ఇక బాలీవుడ్ బ్యూటీ రాణి ముఖ‌ర్జీ ఆదిత్య చోప్రాను గుట్టు చ‌ప్పుడు కాకుండా పెండ్లి చేసుకుంది. ఇప్ప‌టికీ నటిస్తూ సత్తా చాటుతోంది. ఇక బాలీవుడ్ లో మ‌రో నటుడు అఫ్తాబ్ శివదాసానీ త‌న ప్రేయ‌సి నిన్ దుసాంజ్‌ను ఇలాగే త‌న దాన్ని చేసుకున్నాడు. ఇక నేహా ధూపియా కూడా సీక్రెట్ గానే అంగద్ బేడినీ ను వివాహ‌మాడింది.

    ఇక సీనియ‌ర్ క‌పుల్స్ ధర్మేంద్ర,హేమా మాలిని కూడా ఇలాగే పెండ్లి చేసుకున్నారు. ఇప్ప‌టికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. జాన్ అబ్రహం ఇలాగే త‌న ప్రేయ‌సి ప్రియా రుచాంల్‌ను ఎవ‌రికీ తెలియ‌కుండా వివాహం చేసుకున్నాడు. ఇక న‌టి జుహీ చావ్లా కూడా మెహాతాను ఇలాగే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక నటి మినీషా లాంబ కూడా ప్రేమంచి మ‌రీ ర్యాన్ థామ్‌ను సీక్రెట్‌గా వివాహమాడింది. ఇక సైఫ్ అలీ ఖాన్ కూడా అమృతా సింగ్ ను ఇలాగే చేసుకున్నాడు. అయితే ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ విడిపోయారు.

    ఇక షమ్మి కపూర్ కూడా గీతా బాలిని ఇలాగే ల‌వ్ మ్యారేజ్ చేసుకుని అంద‌రికీ షాక్ ఇచ్చాడు. ఇక న‌టి సుర్వీన్ చావ్లా కూడా అక్షయ్ టక్కర్ ను గుట్టు చ‌ప్పుడు కాకుండా పెండ్లి చేసుకుని ఇలాగే సీక్రెట్‌గా పెండ్లి చేసుకున్నారు. ఇక మిర్ మొహ‌సీన్ అఖ్తర్‌ను ఇలాగే ర‌హ‌స్యంగా పెండ్లి చేసుకుని హీరోయిన్ ఊర్మిళా మాంటోడ్కర్ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ట‌ర్కీలో సీక్రెడ్ వెడ్డింగ్ చేసుకుంది. ప్ర‌స్తుతం వీరికి ఒక పాప ఉంది. ఇక యామీ గౌతమ్ కూడా ఈ యేడాదే డైరెక్టర్ ఆదిత్య ధర్‌తో ఏడడుగులు వేసింది.

    Tags