Samantha: ఈ తరంలో అత్యంత ప్రమాదకరమైన వాటిల్లో సోషల్ మీడియా ఒకటి. ప్రపంచంలో ఎక్కడా లేనంత నెగిటివిటీ ఇక్కడే ఉంటుంది. ముఖ్యంగా కొందరు స్టార్స్ విషయంలో, అలాగే కొందరు హీరోయిన్స్ విషయంలో విమర్శలు మరీ హద్దులు దాటుతాయి. మంచి లేదు, మనసు లేదు. చేతికి ఏది వస్తే అది వదిలేయడమే. మనసుతో రాస్తే.. ఏది మంచి, ఏది చెడు అర్ధం అవుతుంది. కానీ, నెటిజన్లలో చాలామంది మత్తులో చెత్త చెత్త వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం సమంత పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పుష్పలో సమంత ఒక ఐటమ్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ లో సామ్ బోల్డ్ లుక్ లో దర్శనం ఇచ్చింది. అది కొందరికి నచ్చలేదు. దాంతో ఏదేదో కామెంట్స్ పెడుతున్నారు. ‘పతివ్రత పరమాన్నం వండితే అసలు చల్లారదు. ఎందుకంటే.. చల్లారితే పతివ్రత కాదు. సమంత కూడా అంతే హిహిహి’ అని ఒకరు కామెంట్ చేశాడు.
మరొక నెటిజన్ ఆ కామెంట్ కి సమాధానం ఇస్తూ.. ‘పరమాన్నం చల్లారింది బ్రో. అయినా పరమాన్నం చల్లారే తీరుద్ది. అది ప్రకృతి సహజం కదా. పైగా ఇప్పుడు హాట్ బాక్స్ లు వచ్చాయి. ఈక్వేషన్స్ కూడా మారిపోయాయి. ఇక పరమాన్నం ఎవరు వండినా చల్లారుద్ది. కాబట్టి.. హాట్ బాక్స్ లో పెడితే చల్లారదు. కాబట్టి.. సమంత కూడా అంతే’ అని మరొకడు కామెంట్ పెట్టాడు.
ఇక ఇంకో నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘అసలు మ్యాటర్ ఏంటంటే ఈ పాతివ్రత్యం అనేది అంతా ట్రాష్. అది అవుట్ డేటెడ్ పదం, అసలు పాతివ్రత్యం అంటేనే మా సామ్ కి నచ్చదు’ అని చెత్త మెసేజ్ పోస్ట్ చేశాడు. అయితే, సామ్ కి సపోర్ట్ గా కూడా కొంతమంది కామెంట్స్ పెట్టడం విశేషం. హాలీవుడ్ ప్రాజెక్ట్స్, ఐటెం సాంగ్స్, టూర్స్, ఎంజాయ్ ఇలా సమంత ఫుల్ బిజీగా ఉంది. ఇలాగే ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ మెసేజ్ పెట్టాడు.
Also Read: Pushpa: అయ్యో పుష్ప.. డబ్బింగ్ వెర్షన్ కి పెట్టిన డబ్బులు కూడా రానట్టేనా
మొత్తమ్మీద సమంత ఐటమ్ సాంగ్ పై నిత్యం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. లిరికల్ వీడియోకే నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటే.. ఇక రేపు వీడియో సాంగ్ రిలీజ్ అయ్యాక, ఎలా రియాక్ట్ అవుతారో !!
Also Read: Pawan Kalyan: ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్లనున్న పవర్ స్టార్… క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే