
Janasena: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ జోష్ లో కన్పిస్తున్నారు. ఓవైపు సినిమాలను జెడ్ స్పీడుతో కంప్లీట్ చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ను సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఓటములనే విజయాలుగా మలుచుకుంటూ పవన్ కల్యాణ్ ముందుకెళుతున్న తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. పవన్ తెగను చూసి ఆయన అభిమానులే కాకుండా సామాన్య ప్రజానీకం సైతం నీరాజనాలు పడుతున్నారు. దీంతో జనసేన ఏపీలో రోజురోజుకు పుంజుకుంటుంది. ఇందుకు నిదర్శంగా ఇటీవల వెల్లడైన స్థానిక సంస్థల ఫలితాలు కన్పిస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు పోలైన ఓటింగ్ శాతం చాలా ఎక్కువ. అంతేకాకుండా జనసేన పార్టీ కొన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో Janasena బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ జనసేన క్రమంగా పుంజుకుంటోంది. ఈ పరిణామాలన్నీ కూడా జనసేనానిలో కొత్త జోష్ నింపినట్లు కన్పిస్తున్నాయి. వీటికితోడు జనసేన ఇటీవల చేపట్టిన రోడ్ల సమస్యకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.
జనసేనాని పిలుపునకు ప్రజలు వేలాదిగా స్పందిస్తున్నారు. ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొంటూ జనసేన వెంట తాము ఉంటామని నిరూపిస్తున్నారు. ఈ పరిస్థితులను Janasena తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. గ్రామగ్రామన పార్టీని బలోపేతం చేసేలా అడుగులు వేస్తోంది. ఈమేరకు ఇప్పటికే అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలను పూర్తి చేసేందుకు కసరత్తులు చేసోంది. అలాగే ఆయా జిల్లాలో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు వీలుగా జనసేనాని జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఇప్పటికే రూట్ మ్యాప్ ఖారారైనట్లు వార్తలు విన్పిస్తున్నాయి.
జనసేనాని కొద్దిరోజుల క్రితం చేపట్టిన శ్రమదానం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరిన్ని ఉద్యమాలను చేపట్టేందుకు జనసేనాని రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లోని సమస్యలు తెలుసుకునేలా పర్యటనలకు సిద్ధమవుతున్నారని టాక్ విన్పిస్తోంది. ఆయా జిల్లాలకు వెళ్లినపుడు సమస్యలపై స్పందించడంతోపాటు పార్టీ అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. జిల్లా అధ్యక్షులు, ఇతర కార్యవర్గాన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్లేలా జనసేనాని కసరత్తులు చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ జిల్లాల వారీగా పర్యటనలు చేయడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని జనసైనికులు భావిస్తున్నారు. పవర్ స్టార్ నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటే ఆ ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ సైతం ఎన్నికల మూడ్లోకి వెళుతున్నారు. ముందస్తు ఎన్నికలకు జగన్ సర్కార్ వెళుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనసేనాని సైతం ఆమేరకు సిద్ధమవుతున్నారు. ఏదిఏమైనా జనసేనాని జిల్లా పర్యటనలతో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారింది.