https://oktelugu.com/

AP News: పీఆర్సీపై తేలని పంచాయితీ.. అసంపూర్తిగా ముగిసిన చర్చలు

AP News: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతోంది. ప్రభుత్వ నిర్వహణకు నానా తంటాలు పడుతోంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు లాగా పరిస్థితి మారింది. దీంతో ఏపీ ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ ప్రకటన కొద్ది రోజులుగా బయటకు రావడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నాళ్లు వేచి ఉండాలనే ప్రశ్నలు ఉద్యోగ సంఘాల్లో వస్తోంది. ప్రభుత్వం పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయకుండా పలుమార్లు సమావేశాలు నిర్వహిస్తున్నా […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 31, 2021 / 11:19 AM IST
    Follow us on

    AP News: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతోంది. ప్రభుత్వ నిర్వహణకు నానా తంటాలు పడుతోంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు లాగా పరిస్థితి మారింది. దీంతో ఏపీ ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ ప్రకటన కొద్ది రోజులుగా బయటకు రావడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నాళ్లు వేచి ఉండాలనే ప్రశ్నలు ఉద్యోగ సంఘాల్లో వస్తోంది. ప్రభుత్వం పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయకుండా పలుమార్లు సమావేశాలు నిర్వహిస్తున్నా సమస్య ఓ కొలిక్కి రావడం లేదు.

    AP News

    దీంతో ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ నివేదిక ప్రకటిస్తే తమ బతుకులు బాగు పడతాయని ఆశిస్తున్నా వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి. దీనిపై రోజురోజుకు నాన్చుడు ధోరణే ఎక్కువవుతోంది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ అధికారులు సమావేశమవుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. దీంతో ఏళ్లుగా ఉద్యోగులకు ఎదురుచూపులే కానీ చర్చలు సఫలం కావడం లేదు.

    Also Read: చీప్ లిక్కర్ పోయింది.. జిన్నా టవర్ వచ్చేసింది..

    సీఎం జగన్ గతంలోనే పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. పలుమార్లు ఉద్యోగులతో చర్చలు జరిపినా ఇంతవరకు ఓ అవగాహనకు రాలేకపోయారు. ప్రభుత్వం ఫిట్ మెంట్ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 14.29 శాతం ఫిట్ మెంట్ ఇస్తామని చెబుతుంటే ఉద్యోగులు మాత్రం ఇంత తక్కువ ఇస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

    ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం పీఆర్సీపై తాత్సారం చేస్తోంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాలో అర్థం కావడం లేదని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. పీఆర్సీ ప్రకటన కోసం ప్రభుత్వం ఇంకా ఎంత సమయం తీసుకుంటుందోననే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

    Also Read: కాపులను మోసం చేస్తుందెవరు.. ట్రెండింగ్ లో ఇద్దరు నేతలు?

    Tags