Prayagraj : సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం.. ఓ మహిళ తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతోంది. అలా మాట్లాడుతుండగానే తన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ను అలా మూడుసార్లు గంగా నదిలో ముంచింది. ఆ తర్వాత ఆ ఫోన్ చేతిలో పట్టుకొని బయటికి వచ్చింది. నీటిలో మూడు మునకలు వేయడంతో ఆ ఫోన్ కాస్త పనిచేయడం ఆగిపోయింది. భర్త వీడియో కాల్ లో ఉండడంతో.. కుంభమేళాకు హాజరు కాకపోవడంతో.. అతడు వీడియో కాల్ లో ఉండగానే ఆమె గంగా నదిలో స్నానం చేయించింది.. దీనివల్ల అతడు కుంభమేళాలో స్నానం చేసిన పుణ్యం కలుగుతుందని ఆమె అభిప్రాయం. ఈ క్రమంలో ఆమె చేసిన పని సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది..” కుంభమేళాలో పాల్గొనకపోతే స్థానికంగా ఉన్న నదిలో స్నానం చేసినా సరిపోతుంది. అంతేగాని వీడియో కాల్ లో ఉన్న భర్త ఉండగా ఫోన్ ను నదిలో ముంచితే ఏమొస్తుంది? ఇదెక్కడి చోద్యం” అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఇంకా చాలా చిత్రాలు..
కుంభమేళాలో ఆ మహిళ చేసిన పని మాత్రమే కాదు.. ఇంకా ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలానే చోటుచేసుకున్నాయి… ఓ వ్యక్తి అయితే ఏకంగా వెయ్యి రూపాయలు ఇస్తే చాలు కుంభమేళాలో స్నానం చేయిస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఇంతకు అతడు చేసిన పని ఏంటంటే.. అతని వాట్సప్ కు మన పాస్ ఫోటో పంపిస్తే.. అతడు దాన్ని ప్రింట్ తీసి.. గంగా నదిలో ముంచుతాడు. తద్వారా కుంభమేళాలో మనకు స్నానం చేసిన అనుభూతి కలిగిస్తాడు. దీనికి అతడు ఒక వ్యక్తికి వెయ్యినూటపదహార్లు వసూలు చేశాడు. ఇంకా కొంతమంది అయితే గంగా నది జలాన్ని రాగి కలశాలలో నింపి.. కొరియర్ చేశారు. దీనికి ఒక్కో కలశానికి 500 నుంచి 1000 వరకు తీసుకున్నారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే కుంభమేళాలో ఎన్నో చిత్రాలు, విచిత్రాలు చోటు చేసుకున్నాయి. మహా కుంభమేళాలో మోనాలిసా మాత్రం హాట్ టాపిక్ అయింది. పూసలు అమ్ముకునే ఆమె సోషల్ మీడియా వల్ల ఏకంగా హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో మణిపూర్ డైరీస్ అనే చిత్రంలో నటిస్తోంది. శివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్ తో కలిసి నేపాల్ వెళ్ళింది. అక్కడి ప్రభుత్వం అభ్యర్థన మేరకు శివరాత్రి వేడుకల్లో మోనాలిసా మాణిపూర్ డైరీస్ చిత్ర యునిట్ తో పాల్గొన్నది. మహా కుంభమేళ ద్వారా ప్రభుత్వానికి లక్షల కోట్లల్లో ఆదాయం వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Also Read : 144 సంవత్సరాల తర్వాత ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా ఎందుకు ముఖ్యమైనదో తెలుసా
భర్తకు వీడియో కాల్.. కుంభమేళా నీటిలో ఫోన్ని ముంచిన మహిళ
తన భర్తకు పవిత్ర సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన అనుభవాన్ని మిగిల్చేందుకు మహిళ యత్నం
పలుమార్లు ఫోన్ను నీటిలో ముంచి తీసిన మహిళ
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో pic.twitter.com/wnfWTorRB9
— BIG TV Breaking News (@bigtvtelugu) February 25, 2025