https://oktelugu.com/

ప్రధానిని టార్గెట్ చేస్తున్న పీకే

ప్రధాని నరేంద్రమోడీ 2014 ఎన్నికల్లో విజయం సాధించడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి కూడా పీకే ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో నేరుగా ప్రధానిని ఢీకొంటున్నారు. మోడీ ప్రత్యక్ష రాజకీయ వ్యూహాలు చేస్తూ మర అడుగు ముందుకేసి వారిని ఒకే వేదిక మీదకు తీసుకురావడం కోసం పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం శరత్ పవార్ కేంద్రంగా మోడీ వ్యతిరేక పార్టీల కలయికకు ప్రశాంత్ కిషోర్ తెర వెనుక పాత్ర […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 26, 2021 5:09 pm
    Follow us on

    Prashant Kishore PM Modiప్రధాని నరేంద్రమోడీ 2014 ఎన్నికల్లో విజయం సాధించడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి కూడా పీకే ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో నేరుగా ప్రధానిని ఢీకొంటున్నారు. మోడీ ప్రత్యక్ష రాజకీయ వ్యూహాలు చేస్తూ మర అడుగు ముందుకేసి వారిని ఒకే వేదిక మీదకు తీసుకురావడం కోసం పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం శరత్ పవార్ కేంద్రంగా మోడీ వ్యతిరేక పార్టీల కలయికకు ప్రశాంత్ కిషోర్ తెర వెనుక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మమత, స్టాలిన్ అధికారం కోసం పీకే పనిచేశారు. బెంగాల్ లో వంద సీట్లు కూడా బీజేపీ దాటదని ముందే జోస్యం చెప్పారు. దీంతో పీకేపై అందరిలో విశ్వాసం పెరిగింది.

    వాస్తవానికి ఆయన పని చేసిన అన్ని రాష్ర్టాల్లో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. దీంతో ఆయన స్థాయి పెరిగింది. ప్రస్తుతం ఆయన జాతీయ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా శరత్ పవార్ ను కేంద్రంగా చేసుకుని పావులు కదుపుతున్నారు ఇప్పుడు ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.

    ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఇన్ చార్జిగా అమిత్ షా వ్యవహరించారు. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో వ్యూహకర్త అవసరం లేకుండా పోయింది. దీంతో బీజేపీ తరఫున అమిత్ షా, ప్రత్యర్థుల వైపు పీకే అన్నట్లుగా రాజకీయాలు నడిచాయి. ఈ నేపథ్యంలో షా బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు.

    బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీతో జతకట్టడం పీకేకు ఇష్టం లేదు. ప్రశాంత్ కిషోర్ సలహాలతో అధికారంలోకి వచ్చిన నితీశ్ అలా చేయడంపై పీకేకు కోపం తెప్పించింది. దీంతో శరత్ పవార్ తో మంతనాలు జరిపారు. బీజేపీ ఓడితే రాష్ర్టపతి అయ్యే అవకాశాలు శరత్ పవార్ కు ఉందని చెప్పారు. దీంతో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందని అందరూ భావించినా పీకే మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చేశారు. బీజేపీని ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదని చెప్పారు.