వ్యాక్సిన్లు సురక్షితమా..? కాదా..?

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ మాత్రమే బాణమని మొదటి నుంచీ పలువురు వైద్య శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ మొదలు పెట్టారు. అప్పటికే పలు దేశాల్లో వ్యాక్సినేషన్ జరిగిన క్రమంలో ఇండియా కాస్త ఆలోచించి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఫిబ్రవరి ఎండింగ్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఏదీ ఏమైనా వందశాంత వ్యాక్సినేషన్ జరిగినేతేనే కరోనా నుంచి తట్టుకోగలమని ఐసీఎంఆర్ […]

Written By: NARESH, Updated On : June 26, 2021 12:24 pm
Follow us on

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ మాత్రమే బాణమని మొదటి నుంచీ పలువురు వైద్య శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ మొదలు పెట్టారు. అప్పటికే పలు దేశాల్లో వ్యాక్సినేషన్ జరిగిన క్రమంలో ఇండియా కాస్త ఆలోచించి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఫిబ్రవరి ఎండింగ్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఏదీ ఏమైనా వందశాంత వ్యాక్సినేషన్ జరిగినేతేనే కరోనా నుంచి తట్టుకోగలమని ఐసీఎంఆర్ సైతం ప్రకటించింది.

తాజాగా వ్యాక్సినేషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సినేషన్లను ప్రజలకు ఇస్తున్నారు. అయితే వ్యాక్సిన్లు వేసుకున్నంత మాత్రాన కరోనా సోకదని చెప్పలేమని, అయితే ప్రమాదకరం కాదని వైద్య శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. దీంతో వ్యాక్సిన్లపై అయోమయం నెలకొంది. మొదట్లో కొందరు వ్యాక్సిన్ వేసుకోగానే మరణించారు. అయితే వారు సైడ్ ఎఫెక్ట్ వల్ల చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. కానీ వ్యాక్సిన్ వేసుకుంటే తట్టుకోలేకేనని కొందరు ప్రచారం చేయడంతో టీకా వేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

అయితే సెకండ్ వేవ్ విజృంభణ తరువాత వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో మరోసారి వ్యాక్సిన్ పైఅయోమం నెలకొనడంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోంది. తాజాగా కరోనా థర్డ్ వేవ్ ఉంటుందన్న నేపథ్యంలో ప్రభుత్వాలు వివిధ అధ్యయనాలు చేశాయి. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా సొంతంగా అధ్యయనం చేసి వాటి వివరాలు తెలిపారు. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో చేసిన అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్లు రెండు డోసులు వేసుకున్నా 76 శాతం మందికి కరోనా సోకిందట. వారిలో పది శాతం మంది ఆసుపత్రి పాలయ్యారట.

అంటే ఈ పరిస్థితి కరోనా ఫస్ట్ వేవ్ లో లేదు. సెకంట్ వేవ్ లో అంత విజృంభించినా పది శాతం మంది ఆసుపత్రుల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇక వ్యాక్సిన్లు వేశాక కూడా ఈ పరిస్థితి ఉంటే ఇక త్వరలో రాబోయే డెల్టా వైర్ నుంచి తట్టుకోగలమా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ప్రముఖ వైద్యుడు ప్రజలకు బలవంతంగా వ్యాక్సిన్లు ఇవ్వొద్దని వాదించాడు. ముఖ్యంగా ఒకసారి కరోనా సోకిన వారు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిందటున్నారు.ఈయన వాదనన కొందరు బలపరుస్తున్నారు. ఒకసారి కరోనా సోకి తట్టుకుంటే ఆ వ్యక్తిలో యాంటిబాడీస్ ఉన్నట్లే. ఇక వ్యాక్సిన్ ఎందుకని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే దేశంలో డెల్టా వైరస్ ఎంట్రీ ఇచ్చిందన్న వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నారు. మరోవైపు దేశంలో ఇంకా వైరస్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ తరుణంలో వ్యాక్సిన్లపై చేస్తున్న అధ్యయనాల రిజల్స్ట్ చూస్తే మాత్రం ఆ విధంగా ఉంది. చివరికి వైద్య నిపుణులు ఎలాంటి ప్రయోగాలు చేసి కరోనాను పాలదోలుతారో చూడాలి..