PK Survey On TRS Leaders: టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం అడుగులు వేస్తోంది. సర్వేలు నిర్వహించి ఎక్కడ అభ్యర్థులు బలహీనంగా ఉంటే వారిని మార్చేందకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ పాటికే సర్వేలు నిర్వహించారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను మార్చే యాలని పీకే సర్వే సూచించినట్లు చెబుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా సర్వే చేపడుతోంది. అన్ని సర్వే నివేదికలు ఆగస్టులోగా అందితే వాటిపై క్రోఢీకరించుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో మూడోసారి అధికారం కోసం టీఆర్ఎస్ అన్నిప్రయత్నాలు ప్రారంభించినట్లు పార్టీ వర్గాల అభిప్రాయం.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో పార్టీ గురించి సర్వేలు నిర్వహిస్తున్నారు. నెలకో సర్వే చేస్తూ ఎమ్మెల్యేల పనితీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీంతో వారిలో భయం పట్టుకుంది. తమ స్థానం ఎక్కడ గల్లంతవుతుందోననే ఆందోళన అందరిలో వస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ముమ్మరంగా కసరత్తులు చేస్తోంది. మూడోసారి అధికారంలోకి రావాలని అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా వ్యూహాలు ఖరారు చేసుకుంటోంది.
Also Read: CM KCR: ఎన్నికలపై సై.. ఎనీ టైం.. మోడీతో ఫైట్ కు కేసీఆర్ రె‘ఢీ’
కొత్తగా పింఛన్లు, రేషన్ కార్డులు అందిస్తే తిరుగులేని విజయం లభిస్తుందని పీకే సూచించిన క్రమంలో పింఛన్లు, కార్డులు ఇవ్వాలంటే డబ్బులు కావాలి. కేంద్రం ఎక్కడ అప్పు పుట్టకుండా చేస్తోంది. దీంతో ఇదే విషయాన్ని సాకుగా చూపి ఎన్నికల్లో లబ్ధిపొందాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే కేసీఆర్ ఎక్కడైనా బీజేపీపై మండిపడుతున్నారు. కేంద్రం తీరును తప్పుపడుతున్నారు. అప్పు ఇవ్వకుండా పన్నుల రాబడి అందకుండా చేస్తోంది. దీంతో సర్కారు మనుగడ కష్టంగా మారుతోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోమారు పాగా వేయాలని టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. పనిచేయకపోతే మంత్రులనైనా పక్కన పెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరింత కఠినంగా వ్యవహరించి పార్టీని మరోమారు అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం. దీని కోసం పీకే వ్యూహాలు, పార్టీ ప్రణాళికలు, కేసీఆర్ పాచికలు అన్నింటిని సమన్వయం చేసి అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతోంది.

పీకే నిర్వహించిన సర్వేలో పలువురు మంత్రులకు వ్యతిరేక ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారు తలలు పట్టుకుంటున్నారు. తమ భవితవ్యం ఏమిటని మథనపడుతున్నారు. ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అవసరమైతే ఇతర పార్టీల్లోకి జంపు చేసి అక్కడైనా టికెట్ సాధించి బరిలో నిలిచేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో మరిన్ని ఆసక్తికర విషయాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం.
Also Read:Janasena Janavani: వైసీపీ అంటే పవన్ కళ్యాణ్ కు అందుకే అంత కోపం?
[…] Also Read: PK Survey On TRS Leaders: పీకే సర్వే: మంత్రులకు గడ్డు … […]