Vijay Deverakonda: యంగ్ మలయాళ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’కి తెలుగులో ఆ మధ్య మంచి ఫాలోయింగ్ వచ్చింది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోయినా.. మీడియం రేంజ్ హీరోలకు బెటర్ ఆప్షన్ గా అనుపమ నిలిచింది. దాంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ప్రేమ మత్తులో అప్పుడు సినిమా ఛాన్స్ లు వదులుకుంది. కానీ అంతా అయిపోయాక తత్త్వం బోధపడిందని.. ఇప్పుడు అవకాశాలు ఇవ్వండి అంటూ తెలుగు దర్శకనిర్మాతల చుట్టూ తిరుగుతుంది ఈ యంగ్ బ్యూటీ.

పైగా అప్పట్లో సినిమాకి 70 లక్షలు కావాలి అని డిమాండ్ చేసి తీసుకున్నేది,కానీ ఇప్పుడు మీరు ఇచ్చినంతే పుచ్చుకుంటాను, మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను అంటూ మొత్తానికి చాన్స్ ల కోసం అనుపమ చాలా ప్రయత్నాలు చేస్తోందట. అయితే, ఆమెకు సెకండ్ హీరోయిన్ పాత్రలు వస్తున్నట్లు తెలుస్తోంది. నాకు మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వండి, రెమ్యూనరేషన్ సగం తగ్గించుకుంటాను అంటూ బేరాలు మాట్లాడుతుందట.
Also Read: Ravi Teja : ఆ ఎంటర్ టైనర్ ముగించాక.. మెగాస్టార్ తో స్టార్ట్ చేస్తాడు !
ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ హైదరాబాద్ లోనే మకాం పెట్టింది. నిత్యం పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు చుట్టూ రౌండ్లు కొడుతోంది. ఎందుకంటే అమ్మడు ఇప్పుడు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీనే నమ్ముకుంది కాబట్టి. మలయాళ సినిమాలు చేసేదే లేదు అంటూ ఆ మధ్య పబ్లిక్ గా స్టేట్ మెంట్లు ఇచ్చి.. మొత్తానికి కేరళ మేకర్స్ కోపానికి కారణం అయింది. అందుకే తెలుగు సినిమాలనే టార్గెట్ చేసుకుని అవకాశాలను వెతుక్కుంటుంది.

ఇప్పటికే, కొన్ని ఆఫర్లను అందుకున్న అనుపమా, స్టార్ డమ్ రావాలంటే స్టార్ హీరోల సినిమాల్లోనే నటించాలని ఫిక్స్ అయింది. అందుకే విజయ్ దేవరకొండ తో రెగ్యులర్ గా టచ్ లోకి వెళ్తుందట. విజయ్ కూడా హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాను అని మాట ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ విజయ్ దేవరకొండ సినిమాలో తన నటనతో గాని అనుపమ మెప్పించగలిగితే, ఇక ఆమె దశ తిరిగినట్టే.
మరిన్ని అవకాశాలు ఆమె దగ్గరకు వెతుక్కుంటూ వస్తాయి. కాకపోతే ఈ యంగ్ బ్యూటీకి ఎక్కువుగా మెయిన్ హీరోయిన్ గానే అవకాశాలు కోరుకుంటుంది. మరి చూద్దాం అనుపమ ఎంతవరకు నెట్టుకొస్తోందో.
Also Read:Rajasekhar Daughter Shivatmika: రాజశేఖర్ కూతురు హాట్ అందాలు.. చూస్తే తట్టుకోలేరు..