KCR vs BJP: కేసీఆర్ ను ఏక్ నాథ్ షిండే బాగా డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాడు. మోడీ పోయిన ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ లో సభ నిర్వహించిన వారానికి విలేకరుల ముందుకు వచ్చిన కేసీఆర్.. తన పాత పద్ధతిలోనే బీజేపీపై విమర్శలు చేశారు. మోదీ వదిలిపెట్టినా, తాను వదిలి పెట్టబోనని స్పష్టం చేశారు. చాలా విషయాల్లో మోదీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన కేసీఆర్ మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే పై ఒంటికాలు పై లేచారు. ఎన్ని కేసులు పెట్టినా ఏం చేయలేరని సవాల్ విసిరారు.

ఇంతకీ ఎందుకు అంత కోపం
రాజకీయాల్లో కేసీఆర్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్. అవసరం ఉంటే ఆకాశానికి ఎత్తుతారు. లేకుంటే అదే స్థాయిలో కిందకు పడేస్తారు. ఇప్పుడు కేసీఆర్ కు బీజేపీ అంటే మంట. ఆ మోదీ అంటే చిరాకు. ఆ అమిత్ షా అంటే ఎలపరం. ఆ బండి సంజయ్ అంటే గరిబోడు. ఇప్పుడు ఆ జాబితాలో ఏక్ నాథ్ షిండే చేరారు. నిన్నటి ప్రెస్ మీట్ లో ఓ 50 సార్లు ఆయన పేరే తలిచారు. ఉద్ధవ్ ఠాక్రే పై ప్రేమ కురిపించారు. తన ప్రభుత్వంలో షిండేలు ఎవరూ లేరని కుండ బద్దలు కొట్టారు. ఆరు నెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తామని, అందుకు ఒప్పుకునే దమ్ము ఉందా అని కేంద్రానికి సవాల్ విసిరారు.
Also Read: PK Survey On TRS Leaders: పీకే సర్వే: మంత్రులకు గడ్డు కాలమే?
ఏక్ నాథ్ షిండేలను ముందే గుర్తించారా?
కేసీఆర్ ఏది చేసినా రాజకీయమే ఉంటుంది. పడుకునే ముందు తప్ప మిగతా సమయం అంతా రాజకీయాల గురించి ఆలోచిస్తారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు. టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో, ప్రభుత్వం పై ఓ నిఘా వ్యవస్థను పెట్టుకున్నారు. చీమ చిటుక్కుమన్నా కేసీఆర్ కు తెలిసి పోతుంది. అలాంటి కేసీఆర్ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో ముందు గానే జాగ్రత్త పడి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. అధికారంలోకి వచ్చారు. రెండో దఫా అధికారంలో వచ్చాకా తాను చెప్పినట్టు ఆడే ప్రతిపక్ష పార్టీల్లో నాయకత్వ మార్పులు ఏర్పడ్డాయి. దీంతో కేసీఆర్ కు ఇబ్బందులు మొదలయ్యాయి. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఫలితాలు దాన్ని రుజువు చేశాయి. ఇక అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా కేసీఆర్ ప్రతిపక్షాలను ముఖ్యంగా బీజేపీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలను కూడగట్టే పనిలోకి దిగారు. గాల్వాన్ సైనికులు, ఉద్యమంలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి తెర లేపారు. పంజాబ్, ఢిల్లీ చుట్టి వచ్చారు. కర్ణాటక కూడా వెళ్లారు. మధ్యలో చర్నా కొరాటా లిఫ్ట్ కోసం మహారాష్ట్ర వెళ్ళారు.

కేసీఆర్ వెళ్ళగానే అప్పటి సీఎం ఉద్ధవ్ గ్రాండ్ వెల్ కం చెప్పారు. ఇక అప్పటి నుంచి కేసీఆర్, ఉద్ధవ్ మధ్య మైత్రి మొదలయింది. ఇదే తరుణంలో ఏక్ నాథ్ షిండే రూపంలో ముసలం పుట్టి ఉద్ధవ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫలితంగా కేసీఆర్ ఓ మిత్రుడిని కోల్పోయారు. ఆ అగ్రహాన్ని ఇలా వెళ్లగక్కారు. రాష్ట్రంలో మొన్న మంచిర్యాల జిల్లాలో పోడు రైతుల పై అటవీ అధికారుల దాష్టీకం, ఓ మహిళపై మారేడ్ పల్లి ఇన్ స్పెక్టర్ వ్యవహరించిన తీరు, సీసీఎస్ ఎస్ఐ విజయ్ ఓ మహిళ పై చేసిన నిర్వాకం వల్ల సర్కారు కు చెడ్డ పేరు వస్తుండటంతో విషయాలను స్తెడ్ ట్రాక్ పట్టించేందుకు మోదీ వెళ్ళిన వారానికి ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పట్లో కేసీఆర్ కు మోదీని గోకే అంత విషయం లేదు. యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమంలో అన్నట్టు ఢిల్లీ కోటలు బద్దలు కొట్టలేడు. కేసీఆర్ సవాలక్ష ప్రెస్ మీట్ లలో ఇదీ ఒక్కటి. అంతకు మించి ఏమీ లేదు. అన్నట్టు హరీష్ రావు ను అదుపులో పెట్టుకున్న తర్వాత, కొడుకును షాడో సీఎం ను చేసిన తర్వాత, కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత, రాజేందర్ ను బయటకి సాగనంపిన తర్వాత.. ఆ ప్రగతి భవన్ లో షిండే ఎవరు? కొంప దీసి సడ్డకుని కొడుకు సంతోష్ రావు అయితే కాదు కదా!
Also Read:Pawan Kalyan:మీ కేశ సంపదను ప్రజలే ఖాళీ చేస్తారు జాగ్రత్త!
[…] […]