దమ్ముంటే అరెస్ట్ చేయండి…ఎమ్మెల్యే సవాల్…!

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలపై తీవ్రంగా స్పందించారు. లాక్ డౌన్ కారణంగా నియోజకవర్గంలోని ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో సామాజిక దూరం పాటించకపోవడం వివాదాస్పదంగా మారింది. తాజాగా ఎమ్మెల్యే చేపడుతున్న నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీకి హాజరైన ఉద్యోగులను సస్పెండ్ చెస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కర్నూలు జిల్లాలో కర్ఫ్యూ దీంతో ఎమ్మెల్యే దమ్ముంటే నన్ను అరెస్టు చేయండంటూ బహిరంగంగా […]

Written By: Neelambaram, Updated On : May 2, 2020 4:28 pm
Follow us on


నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలపై తీవ్రంగా స్పందించారు. లాక్ డౌన్ కారణంగా నియోజకవర్గంలోని ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో సామాజిక దూరం పాటించకపోవడం వివాదాస్పదంగా మారింది. తాజాగా ఎమ్మెల్యే చేపడుతున్న నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీకి హాజరైన ఉద్యోగులను సస్పెండ్ చెస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.

కర్నూలు జిల్లాలో కర్ఫ్యూ

దీంతో ఎమ్మెల్యే దమ్ముంటే నన్ను అరెస్టు చేయండంటూ బహిరంగంగా సవాల్ విసిరారు. సస్పెన్షన్ ఉత్తర్వులను ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళతానాని చెప్పారు. తనతోపాటు జిల్లాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను, మంత్రి అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీల వ్యవహారాన్ని దృష్టి పెట్టాలని మంత్రి అనిల్ కుమార్ కు సూచించారు. పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీలో సామాజిక దూరం పాటించకపోవడంతో గతంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసు స్టేషన్ వరండాలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎస్పీ, కలెక్టర్ లకు ఎమ్మెల్యేకు మద్య దూరం పెరిగింది. ఈ వ్యవహారాన్ని సి.ఎం.ఓ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లి కలెక్టర్, ఎస్పీలపై చర్యలకు ఎమ్మెల్యే డిమాండ్ చేయనున్నట్లు తెలిసింది.