పొడిగింపు సొంత నిర్ణయం కాదు!

దేశంలో మే 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు అన్నది ఏకాభిప్రాయం తర్వాత తీసుకున్న నిర్ణయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అన్ని రాష్ట్రాలతో కలిసి కరోనాపై యుద్దం చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా జోన్ ల వర్గీకరణ జరుగుతోందని ఆయన చెప్పారు. కేసులు ఎక్కువగా రెడ్ జోన్ ల నుంచే వస్తున్నాయని ఆయన వివరించారు. కంటైన్ మెంట్ జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం ఉండాలి. […]

Written By: Neelambaram, Updated On : May 2, 2020 4:13 pm
Follow us on


దేశంలో మే 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు అన్నది ఏకాభిప్రాయం తర్వాత తీసుకున్న నిర్ణయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అన్ని రాష్ట్రాలతో కలిసి కరోనాపై యుద్దం చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా జోన్ ల వర్గీకరణ జరుగుతోందని ఆయన చెప్పారు. కేసులు ఎక్కువగా రెడ్ జోన్ ల నుంచే వస్తున్నాయని ఆయన వివరించారు. కంటైన్ మెంట్ జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం ఉండాలి. వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించాలని ఆయన సూచించారు.

26 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క కేసూ నమోదు కాలేదు. 40 జిల్లాల్లో గత 21 రోజులుగా కేసు కూడా నమోదు కాలేదు. కొత్త కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం అని ఆయన వివరించారు. వలసకార్మికుల కోసం నిన్న ఒక్క రోజే ఆరు రైళ్లు నడిపాం. వలస కార్మికులను తరలించేందుకు ఇవాళ్టి నుంచి 300కు పైగా రైళ్లు నడుపుతాం.టిక్కెట్ ధర ఏభై గా నిర్ణయించడం జరిగిందని, దానికి దూరంతో సంబందం లేదని ఆయన చెప్పారు. దీనిని రాష్ఠ్ర ప్రభుత్వాలు లేదా ఆయా కంపెనీలు చెల్లించాలని ఆయన అన్నారు.