
కరోనా ప్రభావం తో ఎన్నో షూటింగులు ఆగిపోయాయి.కొన్ని సిన్మాలయితే ఏకంగా ఆగి పోయాయి. భారీ బడ్జట్ తో నిర్మించే చిత్రాలు ముందు ముందు తగ్గిపోవచ్చు ఆ క్రమంలో సురేశ్ బాబు నిర్మాతగా .. రానా ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో 100 కోట్ల బడ్జట్ తో నిర్మాంచాలి అనుకొన్న ‘హిరణ్య కశిప’ చిత్రం ఆగిపోనుందని వార్తలొచ్చాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించిన ఈ చిత్రం ఫై లాక్ డౌన్ ఎఫెక్ట్ పడిందనీ, అందువలన సురేశ్ బాబు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేస్తాడని అంతా అనుకొన్నారు .
అలాంటి ఊహాగానాలకు తెరదించుతూ తాజాగా సురేశ్ బాబు తమ ప్రాజెక్ట్ ల వివరాలు వివరించడం జరిగింది. ఆ క్రమంలో ‘హిరణ్య కశిప’ ప్రాజెక్టు ఆగిపోలేదనీ .. తమ బ్యానర్లోనే ఆ సినిమా రూపొందుతుంది అన్నారు. అలాగే తమ బ్యానర్లో రానున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫస్టు కాపీ వచ్చేసిందని చెప్పారు. ‘ అలాగే వెంకటేష్ హీరోగా నిర్మిస్తున్న అసురన్ రీమేక్ `నారప్ప ` ఇంకా 25 శాతం చిత్రీకరణ మిగిలి ఉందనీ, రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో రాబోతున్న ‘విరాటపర్వం’ చిత్రం ఇంకా 8 రోజుల షూటింగు మిగిలి ఉందని అన్నారు. అలాగే అల్లరి ఫేమ్ రవిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘క్రష్’ సినిమా కూడా ఐదారు రోజుల వర్క్ మాత్రమే మిగిలివుందని చెప్పి అందరి అనుమానాలకు తెరదించారు.