‘మా’ ఎన్నికల రాజకీయం చూస్తుంటే వివాదాలు కూడా భయపడేలా ఉన్నాయి. రోజురోజుకు మా పోటీ దారుల మధ్య రాజకీయ మరింత వేడెక్కుతోంది. మొదట్లో మంచు విష్ణు సైలెంట్ గా ఉన్నా.. ఆ తర్వాత డైరెక్ట్ గానే ప్రకాష్ రాజ్ పై కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చే క్రమంలో ప్రకాష్ రాజ్ కూడా ఘాటుగానే స్పందిస్తూ సమాధానాలు చెబుతున్నాడు. ఇలా మొదలైన ఈ వ్యవహారం మొత్తానికి సీరియస్ గా టర్న్ తీసుకుంది.
తాజాగా మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాశ్ రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది. ఎన్నికల నియమావళిని మంచు విష్ణు ఉల్లంఘిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణల్లో ప్రధానాంశం ‘మా’ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం జరుగుతుంది అని ? మరి నిజంగానే పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోందా ?
నిజాలు ఎలా ఉన్నా.. తన ప్యానల్ సభ్యులతో కలిసి ప్రకాష్ రాజ్, ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తూ.. ‘60 ఏళ్లు పైబడిన నటీనటులు పోస్టల్ బ్యాలెట్ కు అర్హులు. అయితే, ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారనేది నిజం. ఇందులో భాగంగానే అర్హత ఉన్న సభ్యుల నుంచి మంచు విష్ణు ప్యానల్ సభ్యులు సంతకాలు సేకరిస్తూ తమ వైపుకు తిప్పుకుంటున్నారు. నిన్న సాయంత్రం విష్ణు తరఫున ఓ వ్యక్తి 56 మంది సభ్యుల తరఫున రూ.28 వేలు కట్టారు.
కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్, శరత్‌బాబు తదితరుల పోస్టల్ బ్యాలెట్ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారు’ అని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది.. పైన చెప్పుకున్న పేర్లు సినీ పెద్దలవి. వాళ్ళను మంచు విష్ణు ప్రభావితం చేయగలడా ? కృష్ణ, కృష్ణంరాజు, పరుచూరి బ్రదర్స్ ఇండస్ట్రీలోనే పెద్దలు.
కాబట్టి.. మంచు విష్ణుకి వాళ్లు సపోర్ట్ చేయాలనుకున్నారు. దీని పై ప్రకాష్ రాజ్ కి మాట్లాడితే రైట్ లేదు అనేది నిజం. అయితే ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తారా ? అంటూ ప్రకాష్ రాజ్ మరో మాట అన్నారు. అలాగే చివరన, ఇంత దిగజారుతారా ? ఈ విషయం పై పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి’ అంటూ ప్రకాశ్ రాజ్ అడగడం విశేషం. మరీ చిరంజీవి దీని పై ఏమంటారో చూడాలి.
