Israel అత్యంత శక్తివంతమైన ఆయుధాలు.. క్షణాల్లో శత్రువులను మట్టు పెట్టగల సామర్థ్యం.. అధునాతన నిఘా పరికరాలు.. దేశం చుట్టూ ఐరన్ డ్రోమ్.. అత్యంత ప్రతిష్టమైన ఇనుపకంచె.. ఇజ్రాయిల్ బహిర్గత, అంతర్గత భద్రత గురించి చెప్పాలంటే ఈ మాత్రం ఉపోద్ఘాతం ఉండాల్సిందే.. హమాస్ పని పట్టేందుకు గాజా స్ట్రిప్ వద్ద ఏకంగా మూడు లక్షల మంది సైన్యాన్ని మోహరించిందంటే ఇజ్రాయిల్ సైనిక శక్తిని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు గాజా పై భూతల దాడి చేసేందుకు ఆ దేశ సైన్యం సమాయత్తమవుతోంది అంటే ప్రతికారేచ్చ ఎలా ఉందో అవగతమవుతోంది. అమెరికా నుంచి అన్ని విధాలా అందుతున్న సహాయంతో ఇజ్రాయిల్ దేశం సైనికంగా బలోపేతమైంది. మధ్య ప్రాచ్యంలో వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఆ దేశం పూర్తిగా సహకరిస్తుందని అమెరికా భావిస్తోంది.
ఇక హమాస్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్ దేశంలో సైనిక నిబంధనలు ఏ దేశంలో లేనంత కఠినంగా ఉన్నాయి. ఆ దేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ విధిగా సైన్యంలో చేరాల్సిందే. పురుషులు కనీసం 32 నెలలపాటు, మహిళలు రెండు సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఇజ్రాయిల్ దేశానికి అణు సామర్థ్యం కూడా ఉంది. అణు వార్ హెడ్లు మూసుకుపోగల జెరి షో మిసైళ్ళు, విమానాలు ఆ దేశం వద్ద ఉన్నాయి. తొలినాళ్లలో సైనిక అవసరాలకు ప్రధానంగా దిగుమతుల మీద ఆధారపడిన ఇజ్రాయిల్.. చూస్తుండగానే సంపన్న దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే దేశంగా రికార్డు సృష్టించింది. అత్యాధునిక ఆయుధాలు, ఆయుధ, నిఘా వ్యవస్థలు, తదితరాలను ఎగుమతి చేసే స్థాయికి ఇజ్రాయిల్ ఎదిగింది. 2018_22 మధ్యకాలంలో కనీసం ఇజ్రాయిల్ దేశం నుంచి 35 దేశాలు 320 కోట్ల డాలర్ల పైచిలుకు ఆయుధాలను దిగుమతి చేసుకున్నాయి. వీటిలో ఏకంగా మూడో వంతు, అంటే 120 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను భారత్ దిగుమతి చేసుకుంది. ఐదు సంవత్సరాల కాలంలో ఇజ్రాయిల్ ఆయుధ దిగుమతులు 270 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ఇవన్నీ కేవలం జర్మనీ, అమెరికా నుంచే కావడం విశేషం. అందులోనూ 210 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులు ఒక్క అమెరికా నుంచే జరిగాయి.
ఇక ఇజ్రాయిల్ తన రక్షణ కోసం ఐరన్ డోమ్ వ్యవస్థను రూపొందించుకుంది. ఏళ్ళ తరబడి రూపొందించి శ్రమించిన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇది. స్వల్ప శ్రేణి రాకెట్లను రాడార్ టెక్నాలజీ సహాయంతో అడ్డగించి తుత్తునీయలు చేయగల సామర్థ్యం దీని సొంతం. హిజుబుల్లా తొలిసారి తనపై రాకెట్లతో దాడి చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 2006 లో ఐరన్ డోమ్ వ్యవస్థను ఇజ్రాయిల్ అభివృద్ధి చేసుకుంది.. 2011లో ఇది ఆడకల్లోకి వచ్చింది. 2021 మొత్తంలో హమాస్, ఇతర పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులు ప్రయోగించిన రాకెట్లలో 90 శాతానికి పైగా నిర్వీర్యం చేసి ఐరన్ డోమ్ తన సత్తా చాట్టింది. ఐరన్ డోమ్ నిర్మాణానికి అమెరికా తన భర్త సహాయం చేసింది. 1946_2023 మధ్యకాలంలో ఏకంగా 12,400 కోట్ల విలువైన సైనిక పరమైన, రక్షణ పరమైన సహాయాన్ని అమెరికా నుంచి ఇజ్రాయిల్ అందుకుంది. అమెరికా 2022 బడ్జెట్లో కేవలం ఇజ్రాయిల్ దేశానికి మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ నిమిత్తం ఏకంగా 150 కోట్ల అమెరికన్ డాలర్లు కేటాయించింది. 10 సంవత్సరాలలో ఇజ్రాయిల్ దేశానికి ఏకంగా 3,800 కోట్ల డాలర్ల మేరకు సైనిక పరంగా నిధులు అందించేందుకు 2016లో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. చుట్టూ శత్రు సమూహం ఉన్న నేపథ్యంలో రక్షణ నిమిత్తం ఇజ్రాయిల్ భారీగా ఖర్చు చేస్తుంది. 2022 లో సైనిక అవసరాల కోసం ఏకంగా 2,340 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. దేశ జనాభా పరంగా చూసుకుంటే ఇజ్రాయిల్ తలసరి సైనిక వ్యయం ఏకంగా 2,535 డాలర్లు. ఖతార్ తర్వాత ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది.