Reheating Cooking Oil: శ్రావణ మాసం తరువాత వరుసగా పండుగలు వస్తుంటాయి. ఈ క్రమంలో పిండివంటలు చేస్తుంటారు. ముఖ్యంగా నూనెకు సంబంధించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని చూస్తుంటారు. అయితే చాలా మంది నూనెను వాడే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించి రకరకాల వంటకాలు చేసుకుంటారు. ఇలా నూనెను ఉపయోగించడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అని కొందరు సందేహం. కానీ ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం నూనెను మళ్లీ మళ్లీ వాడడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రులపాలవుతారని అంటున్నారు. ఇంతకీ నూనెను పదే పదే వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి?
హోటళ్లలో నూనెను ఒకరోజు వాడిన తరువాత మరోరోజూ అదే నూనెను వాడుతూ ఉంటారు. కొన్ని హోటళ్లు మాత్రం నాణ్యతను పాటిస్తాయి. నూనెను పదే పదే వాడడం వల్ల అందులోని ఆహార పదార్థాలు ఉండిపోయి.. ఆ తరువాత తయారు చేసే వాటిపై ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా నూనెలో ఎక్కువగా కొవ్వు పదార్థం ఉంటుంది. ప్రతీసారి వేడి చేయడం వల్ల కొవ్వు వేడవుతూ ఉంటుంది. దీంతో నూనె కల్తీగా మారుతుంది.
ఇంట్లో తయారు చేసుకునే వంటకాల్లోనూ కొందరు నూనెను పదే పదే వాడుతారు. అయితే కొన్ని పరిస్థితుల్లో వంట నూనెను పదే పదే వాడుకోవచ్చు. అంతకుముందు ఓ పనిచేయాలి. వంట నూనె మిగిలిన తరువాత దానిని మరోసారి ఉపయోగించుకోవాలనుకుంటే ఆ నూనెను చల్లారనివ్వాలి. ఒక శుభ్రమైన గుడ్డను తీసుకొని అందులో నూనెను వడబోయాలి. ఆలా వడబోసిన తరువాత వచ్చే నూనెను వాడుకోవచ్చు. అప్పటి వరకు తయారు చేసిన పదార్థాలకు సంబంధించినవి వడబోయడం ద్వారా నూనె ఫ్రెష్ గా మారుతుంది.
ఎక్కడైనా ఒకసారి వాడిన నూనెను మరోసారి ఉపయోగించడం వల్ల రుచిగా ఉండదు. అంతేకాకుండ ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఇంట్లో మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో పైన చెప్పిన విధంగా తయారు చేసుకోని జాడిలో నిల్వ చేసుకోవాలి. అంతేకాకుండా ఇది నిల్వ ఉండే ప్రదేశం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. జాడిలోకి గాలి, ధూళి ప్రవేశించవు. అందువల్ల ఆ నూనె నాణ్యంగా ఉంటుంది. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.