Post Office : అలాగే పొదుపు ఖాతాను తెరిచినప్పుడు నామినేషన్ వేయడం చాలా అవసరం. పోస్ట్ ఆఫీస్ లో ఉండే ఈ ఖాతాలో గరిష్ట డిపాజిట్ పరిమితి ఉండదు. ప్రతినెల 10వ తేదీ వరకు ఈ ఖాతాపై వడ్డీని నెల చివరి వరకు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. సామాన్యులు రిస్క్ లేకుండా చిన్న చిన్న పొదుపులను డిపాజిట్ చేసుకోవడానికి హామీ ఇచ్చే ఆదాయం కోసం పోస్ట్ ఆఫీస్ లో అనేక పొదుపు పథకాలు ఉన్నాయి. బ్యాంకులో లాగానే పోస్ట్ ఆఫీస్ లో కూడా మీరు పొదుపు ఖాతాను తెలుసుకోవచ్చు. నీకు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతాను తెరవవచ్చు.
Also Read : పోస్టాఫీస్ సూపర్ స్కీమ్: తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం
పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతాదారుడు నాలుగు శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో ఈ ఖాతాను మీరు ఒంటరిగా లేదా సంయుక్తంగా కూడా తెరవచ్చు. కనీసం 500 రూపాయలతో మీరు మీకు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతాని తెరవచ్చు. ఈ ఖాతాకు గరిష్ట పరిమితి ఉండదు. అలాగే పోస్ట్ ఆఫీస్ లో ఉన్న పొదుపు ఖాతాలో ప్రతినెల 10వ తేదీ వరకు నెల చివరి తేదీ వరకు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో వడ్డీ రేటు చెల్లించడం జరుగుతుంది.ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వడ్డీ రేట్లు నిర్ణయిస్తుంది. ఒకవేళ మీరు ఖాతాను మూసి వేస్తున్నట్లయితే ఆ ముందు నెలలో మీకు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీని చెల్లిస్తారు.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖ చట్టం 80 టిటిఏ ప్రకారం పొదుపు ఖాతాలో ఉన్న రూ.10,000 వరకు పన్ను రహిత వడ్డీ లభిస్తుంది. మీరు పోస్ట్ ఆఫీస్ లో కనీసం రూ.500 రూపాయలతో ఒంటరిగా లేదా సంయుక్తంగా పొదుపు ఖాతాను తెరవచ్చు. 10 గుణిజాలలో ఈ ఖాతా నెంబర్ ఉంటుంది. ఈ ఖాతా యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని నుంచి మీరు కనీసం 50 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు. కానీ మీ ఖాతాలో రూ.500 కంటే తక్కువగా ఉంటే మీరు విత్డ్రా చేసుకోలేరు. ఒక ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పోస్ట్ ఆఫీస్ లో ఉన్న పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ రూ.500 లేకపోతే ఖాతా నిర్వాహన రుసుముగా మీ పొదుపు ఖాతా నుంచి రూ.50 రూపాయలు కట్ అవుతుంది. ఒకవేళ ఖాతా బ్యాలెన్స్ పూర్తిగా జీరో అయితే స్వయం చాలాకంగా మీ ఖాతా క్లోజ్ అవుతుంది.