Post Office Best Scheme : పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో మీరు ప్రతి రోజు కేవలం రూ.100 రూపాయలు పొందుకు చేస్తే మీరు ఐదు సంవత్సరాలలో రూ.2.14 లక్షలు సొంతం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ హామీతో పోస్ట్ ఆఫీస్ లో సురక్షితమైన మరియు ఆకర్షణీయమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో సామాన్యులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పథకాలు ఎంతగానో సహాయం చేస్తాయి. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకం అనేది నెలవారి పొదుపు పథకం. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నా వారికి ఇది చాలా బెస్ట్ పథకం. కనీసం మీరు ఈ రికరింగ్ డిపాజిట్ పథకంలో రూపీస్ వంద రూపాయలు నెలవారి డిపాజిట్ తో మొదలు పెట్టవచ్చు. రికరింగ్ డిపాజిట్ స్కీంలో ఎటువంటి గరిష్ట పరిమితి ఉండదు. పోస్ట్ ఆఫీస్ వారు వినియోగదారులకు ఈ స్కీం పై 6.7% వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నారు.
Also Read : కేవలం 5 ఏళ్లలో రూ.14 లక్షలు పొందొచ్చు.. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సూపర్ డూపర్ పథకం ఇదే..
కాంపౌండ్ వడ్డీ ఆధారంగా మెచ్యూరిటీ సమయానికి వడ్డీ లెక్కించబడుతుంది. ఐదు ఏళ్ళు మెచ్యూరిటీ సమయాన్ని ఈ పథకం కలిగి ఉంటుంది. ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ సమయం పూర్తి అయిన తర్వాత మీరు ఈ పథకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.మీరు ఈ రికరింగ్ డిపాజిట్ పథకంలో రోజుకు కేవలం 100 రూపాయలు పొదుపు చేస్తే నెలకు 3000 రూపాయలు పొదుపు చేసినట్లు. ఐదు సంవత్సరాలకు అంటే మొత్తం 60 నెలలకు మీరు డిపాజిట్ చేసిన మొత్తం రూ.1,80,000 అవుతుంది. ఇక మీరు పెట్టిన పెట్టుబడి పై 6.7% వార్షిక వడ్డీ రేటు ఆధారంగా 5 ఏళ్లలో మీరు పెట్టిన పెట్టుబడికి రూ.34,097 వడ్డీ వస్తుంది.
మీరు పెట్టిన పెట్టుబడి అలాగే వడ్డీ కలిపి మీరు మెచ్యూరిటీ సమయానికి రూ.2,14,097 అందుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న రికార్డింగ్ డిపాజిట్ పథకంలో మీరు చిన్న చిన్నగా పొదుపు చేసుకుని గణనీయమైన రాబడి అందుకోవచ్చు. రోజువారి కూలీ కు పని చేసే సామాన్య ప్రజలకు పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకం చాలా సహాయపడుతుంది. భవిష్యత్తులో మీ పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు రికరింగ్ డిపాజిట్ పథకంలో చిన్న చిన్న మొత్తంలో పొదుపు చేయడం వలన మీరు ఐదేళ్ల సమయానికి అధిక రాబడి పొందవచ్చు.