Kapu Women Scheme : ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళకు గృహిణి పేరుతో రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కాపు మహిళా సంక్షేమానికి భారీగా నిధులను కేటాయించడం జరిగింది. ఈ పథకంపై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాపు మహిళా సాధికారతకు ఈ పథకం ఒక ముందడుగు కానుంది అని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మహిళల కోసం మరొక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు రాష్ట్ర వ్యాప్తంగా గృహిణి పేరుతో కాపు మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని తాజాగా తెలిపారు. కాపు కార్పొరేషన్ గృహిణి పథకం కింద కాపు మహిళలలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి రూ.15 వేలు అందజేయాలని ప్రతిపాదించింది. ఈ పథకానికి రూ.400 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు.
Also Read : ‘అంతిమ లబ్ధిదారుడు’ టార్గెట్.. సిట్ కస్టడీ ఆ నలుగురు
త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకోనున్నారు. రీసెంట్ గా తాడేపల్లి లో ఉన్న కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపల్లి సుబ్బారాయుడు గృహిణి పథకం పై కొన్ని కీలక వ్యాఖ్యలను చేశారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కాపు సంక్షేమ మహిళలకు రూ.4,600 కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఒక ఏడాదిలో వీటి ఫలితాలను చూపిస్తామని కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. కాపు మహిళలకు గతంలో కూడా పథకాలను అమలు చేసిన సంగతి తెలిసిందే.
గత ప్రభుత్వ పాలనలో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. లబ్ధిదారులకు ఈ పథకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రతిఏటా రూ.15 వేలు చొప్పున ఒక్కొక్కరికి ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థికంగా సహాయం చేస్తామని ప్రకటించడం జరిగింది. కాపు, బలిజ, ఒంటరి, తెల్లగా కులాలకు ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు ప్రతి ఒక్కరికి ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించారు. ప్రస్తుతం పాలనలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ రానుంది.