తిరుమలకు మరింతగా భక్తులు పెరగడం ఖాయం?

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు. భక్తకోటికి వరాలిచ్చే దేవుడు శ్రీనివాసుడు. హిందువుల ఆరాధ్య దేవుడుగా గుర్తించబడిన శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. తిరుమల కొండ భక్తజనంతో కిక్కిరిసిపోతోంది. వడ్డీకాసులవాడిగా భక్తులకు దర్శనమిస్తున్న దేవుడు వెంకటేశుడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని తరిస్తుంటారు. ఇటీవల హనుమంతుడి జన్మస్థలం కూడా అంజనాద్రి అని తిరుమల తిరుపతి దేవస్థానం తేల్చేయడంతో హనుమాన్ దర్శనానికి సైతం భక్తలు పోటెత్తే అవకాశముంది. ఆంజనేయుడి జన్మస్థానంపై గతంలో […]

Written By: Srinivas, Updated On : August 4, 2021 10:05 am
Follow us on

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు. భక్తకోటికి వరాలిచ్చే దేవుడు శ్రీనివాసుడు. హిందువుల ఆరాధ్య దేవుడుగా గుర్తించబడిన శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. తిరుమల కొండ భక్తజనంతో కిక్కిరిసిపోతోంది. వడ్డీకాసులవాడిగా భక్తులకు దర్శనమిస్తున్న దేవుడు వెంకటేశుడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని తరిస్తుంటారు. ఇటీవల హనుమంతుడి జన్మస్థలం కూడా అంజనాద్రి అని తిరుమల తిరుపతి దేవస్థానం తేల్చేయడంతో హనుమాన్ దర్శనానికి సైతం భక్తలు పోటెత్తే అవకాశముంది.

ఆంజనేయుడి జన్మస్థానంపై గతంలో నుంచి కూడా అనేక వివాదాలు, సంవాదాలు చోటుచేసుకున్నాయి. టీటీడీ సైతం దీనిపై లోతైన చర్చలు పరిశోధనలు చేసింది. ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రి అనే ఆధారాలు ఉన్నాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంజనాద్రికి భక్తులు పోటెత్తి బాగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశముంది. వెంకటేశ్వరస్వామితో పాటు హనుమాన్ దర్శనం కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి టీటీడీ స్పందించి అంజనాద్రిని ఆంజనేయుడి జన్మస్థలంగా ప్రకటించడంపై అందరు ప్రశంసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హనుమాన్ ఆలయానికి భక్తజనసంద్రంగా మారనుంది. దేవాలయానికి మహర్దశ పట్టనుంది. టీటీడీ హనుమంతుడి జన్మస్థలంపై కచ్చితమైన విధంగా ఆలయ విశిష్టతను ప్రచారం చేసేలా ప్రణాళిక రచిస్తోంది. హనుమాన్ జన్మస్థలం విషయమై ఎవరితోనైనా చర్చలకు సిద్ధమని టీటీడీ ప్రకటిస్తోంది. హనుమ పుట్టుక తిరుమలలోనే అని నిరూపించేందుకు ఆధారాలు ఉన్నాయని చెబుతోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీంతో భక్తులు లక్షల్లో వస్తుంటారు. స్వామి దర్శనానికి బారులు తీరుతుంటారు. ఇదే సందర్భంలో తిరుమలలో అంజనాద్రి ని అభివృద్ధి చేస్తే భక్తులు అక్కడకు కూడా వెళ్లి పూజలు చేస్తే అంజనాద్రి కూడా భక్తులతో నిండిపోనుంది. టీటీడీ చేస్తున్న ప్రచారానికి భక్తుల నుంచి మంచి స్పందన రానుంది. భక్తుల సంఖ్య పెరిగితే మరింత శోభాయమానంగా మారనుంది.