https://oktelugu.com/

Posani Shocking Comments About CM Jagan: జగన్ ను దగ్గరి నుంచి చూస్తే.. పోసాని షాకింగ్ వ్యాఖ్యలు

Posani Shocking Comments About CM Jagan: జగన్ కు ఉన్న పరమ భక్తులలో పోసాని కృష్ణమురళి కూడా ఒకరు. జగన్ ను ఎవరు ఏమన్నా సరే వెంటనే రంగంలోకి దిగిపోయి వారిని చెడామడా తిట్టేయడంలో ఆయన చాలా ముందు ఉంటాడు. ఎప్పటికప్పుడు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉండే పోసాని.. మరోసారి జగన్ మీద సంచలన కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కారు. సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన.. ఈరోజు ఉదయం స్వామి వారి సేవలో […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 22, 2022 / 03:18 PM IST
    Follow us on

    Posani Shocking Comments About CM Jagan: జగన్ కు ఉన్న పరమ భక్తులలో పోసాని కృష్ణమురళి కూడా ఒకరు. జగన్ ను ఎవరు ఏమన్నా సరే వెంటనే రంగంలోకి దిగిపోయి వారిని చెడామడా తిట్టేయడంలో ఆయన చాలా ముందు ఉంటాడు. ఎప్పటికప్పుడు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉండే పోసాని.. మరోసారి జగన్ మీద సంచలన కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కారు. సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన.. ఈరోజు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

    Posani Shocking Comments About CM Jagan

    అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నారు. జగన్ ను చాలామంది చాలా మాటలు అంటున్నారని.. కానీ ఆయనను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మూవీ టిక్కెట్ల విషయాన్ని తెరపైకి తెస్తూ పోసాని మాట్లాడారు. మూవీ టికెట్ల విషయంలో చాలా మంది చాలా రకాలుగా జగన్ ను తిట్టారని.. కానీ చివరకు ఏమైందో అందరికీ తెలుసు కదా అంటూ చెప్పుకొచ్చారు.

    Also Read:  కేంద్రంపై కేసీఆర్ ‘వరి’ పోరు వెనుక షాకింగ్ నిజాలు

    పేద ప్రజలపై భారం పడకుండా, సినిమా ఇండస్ట్రీ నష్టపోకుండా జగన్ నిర్ణయం తీసుకున్నారని అది ఎంతో మంచిది అంటూ పొగడ్తలు కురిపించారు. తాను ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నానని.. కాకపోతే సినిమాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే ఆయన జగన్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

    Posani Shocking Comments About CM Jagan

    జగన్ ను దూరం నుంచి చూసే వారికి ఒక బ్రహ్మ పదార్థంలా కనిపిస్తారని, కానీ దగ్గరనుంచి చూసేవారికి మాత్రం దేవుడి ప్రసాదంలా కనిపిస్తారని చెప్పుకొచ్చారు. పైగా బ్రహ్మ పదార్థం అంటే తెలుసు కదా అంటూ చమత్కరించారు. ఈ విధంగా జగన్ మీద ఉన్న ప్రేమను పోసాని మరోసారి బయటపెట్టారు. ఇక తాను హీరోగా రెండు సినిమాలు చేస్తున్నానని.. అందులో ఒకటి రిలీజ్ కు రెడీ గా ఉండగా.. మరొకటి సెట్స్ పై ఉందని చెప్పుకొచ్చాడు పోసాని.

    Also Read: బీజేపీతో యుద్ధానికి సిద్ధమవుతున్న కేసీఆర్ ?

    Recommended Video:

    Tags