Telangana Congress: దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది.. ఆ హద్దు మీరితే వచ్చే ఫలితం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం టీ కాంగ్రెస్ లో అసమ్మతి నేతల పరిస్థితి ఇలాగే తయారైంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు తీసుకున్న తర్వాత.. ఈ అసమ్మతి గోల చాలా ఎక్కువగా అయింది. ముఖ్యంగా జగ్గారెడ్డి, విహెచ్ లాంటి వారు రాజీనామా చేస్తానంటూ బెదిరిస్తూ పార్టీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. అయితే ఇన్ని రోజులుగా బుజ్జగిస్తూ వచ్చిన టీ కాంగ్రెస్.. ఇక వీరిని ఇలాగే వదిలేస్తే లాభం లేదనుకుని యాక్షన్ షురూ చేసింది.
ప్రస్తుతం రాజీనామాకు రెడీ అంటున్న జగ్గారెడ్డికి పార్టీలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు అదనపు బాధ్యతల నుంచి రేవంత్ తొలగించారు. ఇలాంటి అసమ్మతి నేతలు వల్ల టీ కాంగ్రెస్ ఇంకా బలహీనపడుతుందని.. తద్వారా ప్రతిపక్ష పార్టీల వ్యూహాల ప్రకారం వీళ్లు పని చేస్తున్నారంటూ ఎప్పటి నుంచో రేవంత్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం టీ కాంగ్రెస్ లో రేవంత్ వర్గీయులదే పై చేయి.
కాబట్టి వారంతా ఏఐసీసీకి ఈ అసమ్మతి నేతలపై తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఎన్నిసార్లు చెప్పినా వినక పోవడంతో ఏఐసీసీ కూడా అసమ్మతి నేతలపై చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వారికి పదేపదే హెచ్చరికలు జారీ చేసినా.. వినకపోవడంతో టీపీసీసీకి ఫుల్ పవర్స్ ఇచ్చింది. దీంతో దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా రేవంత్ కూడా వారిపై యాక్షన్ షురూ చేశారు.
ఇప్పటికే ఇలాంటి అసమ్మతి నేతల కారణంగా పంజాబ్ లో అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్. కాబట్టి తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి రావద్దంటే ఇలాంటి నేతలను పక్కన పెట్టక తప్పదేమో. ఒకరిద్దరుపై యాక్షన్ తీసుకుంటేనే.. మిగతావారు దారిలోకి వస్తారనేది ఏఐసీసీ ప్లాన్. జగ్గారెడ్డి పవర్స్ కట్ చేసిన ఏఐసీసీ.. పార్టీ ప్రక్షాళనకు కూడా వెనకడుగు వేయదని తెలుస్తోంది.
ఇంకా బుజ్జగించుకుంటూ కూర్చుంటే.. పార్టీకి జరగాల్సిన నష్టం జరుగుతోందని.. రేవంత్ ఏదైనా సభ లేదా నిరసన కార్యక్రమం లాంటివి పెట్టుకున్నప్పుడే జగ్గారెడ్డి లేదా విహెచ్ లాంటి అసమ్మతి నేతలు తెరమీదికి వస్తున్నారని.. కాబట్టి వారిపై యాక్షన్ తీసుకుంటేనే మంచిది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Recommended Video: