https://oktelugu.com/

నేడు పోలింగ్.. నగర వాసుల తీర్పు ఎలా ఉండనుంది?

తెలంగాణలో ఈసారి జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నారు. గడిచిన పదిహేను రోజులుగా ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేలా విస్కృతంగా ప్రచారం చేశాయి. తెలంగాణలో కొద్దిరోజుల క్రితం జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పు రావడంతో సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. Also Read: జీహెచ్ఎంసీ అప్డేట్: పోలింగ్ ప్రారంభం.. ఓటర్ల బారులు ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఓటర్లను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 1, 2020 / 08:30 AM IST
    Follow us on

    తెలంగాణలో ఈసారి జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నారు. గడిచిన పదిహేను రోజులుగా ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేలా విస్కృతంగా ప్రచారం చేశాయి. తెలంగాణలో కొద్దిరోజుల క్రితం జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పు రావడంతో సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

    Also Read: జీహెచ్ఎంసీ అప్డేట్: పోలింగ్ ప్రారంభం.. ఓటర్ల బారులు

    ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ పోటీపడ్డాయి. నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ఉండటంతో నిన్నంతా పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేశారు. అధికార పార్టీ ఖర్చుకు ఏమాత్రం వెనుకడకపోవడంతో మిగతా పార్టీల నేతలు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

    ఇక నిన్నటి మొన్నటి ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకున్న నేతలు.. నేడు ఓటర్లను పోలింగ్ బూత్ ల వరకు తీసుకెళ్లి ఓటు వేయించుకోవడమనేది కత్తిమీద సాములా మారింది. నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఓటర్లను ఎవరైతే తమవైపు తిప్పుకుంటారో వారికే విజయాలు ఎక్కువ అవకాశాలు ఉండటంతో నేతలంతా ఆ పనుల్లో బీజీగా ఉన్నారు.

    Also Read: బల్దియాలో చివరగా బ్యాలెట్ ఎన్నిక ఎప్పుడు జరిగిదంటే?

    ఇక నేడు జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకొని విధుల్లో చేరారు. అయితే ప్రతీసారి నగరవాసుల ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుండటం గమనార్హం. కాగా ఈసారి కరోనా నేపథ్యంలో ఎన్నికలు జరుగుతుండటంతో ఓటింగ్ శాతంపై ప్రభావం చూపేలా కన్పిస్తోంది. ఏదిఏమైనా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్