https://oktelugu.com/

జేసీ దివాకర్ రెడ్డికి భారీ జరిమానా

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసి దివాకర్ రెడ్డికి మైనింగ్ శాఖ భారీ జరిమానా విధించింది. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీలో దివాకర్ రెడ్డి రూ. 100 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డారని జరిమానా కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని ఆ శాఖ అధికారులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి రూ. 14 లక్షల మెట్రిక్ టన్నుల దోపి జరిగినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు పెద్దప్పూర్ మండలంలోని ముచ్చుకోట […]

Written By: , Updated On : December 1, 2020 / 08:38 AM IST
Follow us on

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసి దివాకర్ రెడ్డికి మైనింగ్ శాఖ భారీ జరిమానా విధించింది. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీలో దివాకర్ రెడ్డి రూ. 100 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డారని జరిమానా కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని ఆ శాఖ అధికారులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి రూ. 14 లక్షల మెట్రిక్ టన్నుల దోపి జరిగినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు పెద్దప్పూర్ మండలంలోని ముచ్చుకోట అటివీ ప్రాంతంలో దివాకర్ రెడ్డి కుటుంబీకులు నిర్వహిస్తున్న భ్రమరాంబ, సుమన మైనింగ్ సంస్థల్లోనూ అక్రమాలు జరిగాయిన మైనింగ్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా పనులు నిర్వహించడంతో వారికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా దివాకర్ రెడ్డికి జరిమానా విధించడంతో టీడీపీలో కలకలం రేపింది.